కంది కొండ జాతర పనులు పరిశీలన
డోర్నకల్ ఆర్సి నేటిధాత్రి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రం ఐన కురవి మండలంలోని కందికొండ గ్రామ శివారులో ఉన్న కందగిరి గుట్టపై కొలువు ఐన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి మహా జాతర సందర్భంగా ఈనెల 5వతేదీన కార్తీకపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని నిర్వహించనున్న మహ జాతర నేపథ్యంలో జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టిన పనులు పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మాజీ జెడ్పీటిసి, కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, ఈ కార్యక్రమంలో మరిపెడ సిఐ రాజ్ కుమార్ గౌడ్, సిరొలు ఎస్సై సంతోష్, విద్యుత్ శాఖ అధికారులు, రెవిన్యూ శాఖ అధికారులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
