
Panchayat Raj Women, Child and Welfare Department
మహిళా సదస్సు ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా అధికారులు కాంగ్రెస్ నాయకులు.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండలంలో మహిళా సదస్సు ప్రాంగణాన్ని పరిశీలించిన చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి* ఈనెల 18వ తారీకున మహిళా సదస్సు కార్యక్రమానికి పంచాయతీరాజ్ మహిళా ,శిశు ,సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విచ్చేస్తున్న సందర్భంగా సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను ముమ్మరం పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిళా సదస్సు చిట్యాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నాం జిల్లాలోని మహిళలందరూ విచ్చేసి సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన అందులో భాగంగానే శిశు సంక్షేమ శాఖ మాత్యులు సీతక్క విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పతకాలు , మహిళల సాధికారిక అనేక అంశాలపై ప్రసంగిస్తారు కావున వివిధ మండలాల గ్రామాల్లోని మహిళలు విధిగా జిల్లాలోని ప్రతి ఒక్క మహిళ యొక్క ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పి డి డిపిఎంలు ఎంపీడీవో జయశ్రీ ఎంపీ ఓ రామకృష్ణ జిల్లా అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ , కాంగ్రెస్ నాయకులు చిలుముల రాజమౌళి బుర్ర శ్రీను బుర్ర మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు