Unique Protest Over Water Issue in Warangal
వరంగల్లో తాగునీటి సమస్యపై వినూత్న నిరసన.
నేటిధాత్రి, వరంగల్ టౌన్.
వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట 19వ డివిజన్ కాలనీవాసులు మంగళవారం ధర్నాకు దిగారు. తమ ప్రాంతంలో వస్తున్న రంగు మారిన తాగునీటి సమస్యపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలని వాసులు మున్సిపల్ అధికారులకు రంగు మారిన నీటిని సీసాల ద్వారా అందజేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తాగునీటి నాణ్యతను నిర్ధారించి, శుభ్రమైన నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తరువాత కార్యాలయం ముందు బైఠాయించి కమిషనర్ వచ్చేవరకు అక్కడి నుండి కదలబోమని కాలనీవాసులు స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి కమిషనర్ స్వయంగా హామీ ఇవ్వాలని వారు కోరారు. స్థానిక ప్రజలు తాగునీటి సమస్యను తరచుగా ప్రస్తావిస్తున్నా, అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఈ నిరసనకు దిగినట్లు వారు తెలిపారు.
