
Injustice to those who deserve it in Indiramma's homes
ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వారికి అన్యాయం
సిపిఎం పట్టణ నాయకులు మడికొండ ప్రశాంత్
పరకాల నేటిధాత్రి
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం నాయకులు మడికొండ ప్రశాంత్ విమర్శించారు.ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లు అందిస్తామని చెప్పి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుందని,చాలామంది పేదలకు ఇండ్లు వస్తాయని ఆశించినప్పటికీ నిరాశ ఎదురయిందని,ఇందిరమ్మ కమిటీలు నియమించినప్పటికీ అందులో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చి ఇండ్లు కూడా వారికే ఇచ్చారని,గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్ రూమ్ లు బిఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయించినట్లుగానే,కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇండ్లు కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చి పేదలకు అన్యాయం చేసిందని,పట్టణంలోని రెండో వార్డులో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండానే,కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని తెలిపారు.కార్యకర్తల కొరకు లబ్ధి చేకూర్చడం కోసమే తీసుకొచ్చిన పథకాలను ప్రజల లబ్ధి కోసమే ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజాప్రతిని స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.