వ్యక్తిని హత్య చేసి.. తగులబెట్టి..
చెన్నూర్ నేటి ధాత్రి::
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కమ్మెరపల్లి గ్రామ శివారులో దారుణం జరిగింది. పొన్నారం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్ కమ్మరిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో మహేందర్‌ను గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి పిలిపించుకుని అతి కిరాతకంగా హతమార్చారు. అనంతరం అతడి మృతదేహాన్ని గ్రామ పొలిమేరల్లోకి తీసుకెళ్లి తగులబెట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణ చేపట్టి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాక్షికంగా కాలిన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.