
AIF DS District Assistant Secretary Martha Nagaraju
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐఎఫ్ డిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు అన్నారు.గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.మార్త నాగరాజు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న విద్యాసంస్థల్లో సమస్యలు పేరుకుపోయాయని,విద్యాశాఖ అధికారులు , ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యల సాధన కోసం కృషి చేయాలని కోరారు.డివిజన్ కేంద్రంలో ఉన్న ఎస్సి,ఎస్టీ,బీసీ మైనారిటీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గర్ల్స్ కన్వీనర్ గణిపాక బిందు,జిల్లా కమిటీ సభ్యులు సాగర్ ,అజయ్ తదితరులు పాల్గొన్నారు.