జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి అధ్యక్షులు కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు )
“నేటిధాత్రి” ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల.
ప్రకాశం జిల్లా, పెద దోర్నాల మండలం, పెద్ద చామ గ్రామంలో శనివారం నాడు జాతీయ ఆదివాసీ సంరక్షణ సమితి అధ్యక్షులు
కారం సీతారామన్న దొర(ఢిల్లీ బాబు) పర్యటించారు.
ఈ సందర్భంగా సీతారామన్న దొర మాట్లాడుతూ ఆదివాసీ చెంచు గిరిజన గ్రామాలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు,
చీకటి బతుకులు బతుకుతున్న చెంచుల నివాస ప్రాంతాలలో విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు,గిరిజన పాఠశాలలు ఆధునీకరణ చేయాలన్నారు, చెంచు గూడాలలో రోడ్డు సదుపాయం లేక గిరిజనుల పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసామని చెంచు గ్రామాలలో వెంటనే రోడ్డు, రవాణా సదుపాయం కల్పించాలన్నారు, చెంచు గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలలో మెరుగైన సదుపాయాలతో పౌష్టిక ఆహారం అందించాలన్నారు, చెంచు ఆదివాసీల ఉపాధికై (MGNREGS) ఉపాధి హామీ పనులు కల్పించాలన్నారు, చెంచు ఆదివాసీల అభివృద్ధికి ట్రై కార్ రుణాలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవాలి అన్నారు, చెంచు గిరిజనులు సేకరించుకుంటున్న అటవీ ఫలాలను అమ్ముకోకుండా అడ్డుపడుతున్న అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని,
పక్కా భూములు కలిగి ఉన్న ఆదివాసీలకు వ్యవసాయం చేసుకొనుటకు నీటి సదుపాయం లేకపోవడంతో బీడు పట్టిన భూములలో సాగు చేసుకోవటం కోసం 500 అడుగులు పైన గల లోతు బోర్లు ప్రభుత్వం వెంటనే కేటాయించాలన్నారు , ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తానని కారం సీతారామన్న దొర( ఢిల్లీ బాబు) అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంరక్షణ సమితి నాయకులు కారం గంగాధర్ రావు, కాక శివశంకర్ ప్రసాద్ మరియు గ్రామస్తులు
దాసరి వెంకన్న, మల్లి గురవయ్య, దంసం లక్ష్మన్న, దాసరి పెద గురవయ్య,చిన గురవయ్య , దంసం చిన పెద్దన్న, దంసం గురవమ్మ, , దాసరి వెంకట లక్ష్మి, , దాసరి రామయ్య మొదలగు వారు పాల్గొన్నారు.