Indiramma Housing Housewarming in Tangallapalli
తంగళ్ళపల్లి మండల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండలం మండల పరిధిలోని గ్రామాలలో మొత్తం 11 ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు జరిగినాయి. ఇట్టి గృహప్రవేశాలకు .రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి హాజరైనారు. ముందుగా తంగళ్ళపల్లిలోని .ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో హౌసింగ్ శాఖ నిర్మించిన మోడల్ హౌస్ ను. ప్రారంభించారు. తర్వాత మండెపల్లి. చింతలపల్లి. రాళ్లపేట. మొత్తం 11 ఇందిరమ్మ ఇండ్లు పూర్తికాగా గృహప్రవేశాలను గురువారం ముఖ్య అతిథులుగా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్. కేకే మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై గృహప్రవేశాలు జరిపించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ మాట్లాడుతూ సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమహిళ పథకాన్ని అమలు చేస్తుందని. దీనిలో భాగంగా లబ్ధిదారులకు నాలుగు విడు తల్లో ఐదు లక్షల ఆర్థిక సాయం మంజూరు చేస్తుందని తెలుపుతూ. ఆయా గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మిగతా లబ్ధిదారులు అందరూ ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని త్వరి తగి తిన .తమ సొంత ఇంటి కలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అధికారులు అందుబాటులో ఉండి నిర్మాణాలు పూర్తి చేసుకునేలా సహకరించాలని ఆదేశించారు. అలాగే తంగళ్ళపల్లి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న తాసిల్దార్ కార్యాల భవనాన్ని ఇన్చార్జి కలెక్టర్ పరిశీలించారు తొందరగా పనులు పూర్తి చేయాలని చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రాళ్ల పేట గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ సందర్శించారు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు విద్యార్థులకు అందిస్తున్న బోధన మౌలిక సదుపాయాల తీరుపై ఆమె ఆరా తీశారు. ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. హౌసింగ్ పీడీ శంకర్. మండల ప్రత్యేక అధికారి డిపిఓ సర్పద్దిన్. తంగళ్ళపల్లి తహసిల్దార్. జయంత్. ఎంపీడీవో లక్ష్మీనారాయణ. నాయకులు ప్రభుత్వ అధికారులు ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
