ప్రభుత్వ కొలతల ప్రకారంగానే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలి
సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్ నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామ పంచాయతీని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం సందర్శించారు. గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి,ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని లబ్ధిదారులకు తెలియజేశారు.సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,ఎంపీడీవో జి.సత్యనారాయణ గౌడ్,ఎంపీవో శ్రీపతి బాబురావు,హౌసింగ్ ఏఈ కాంక్ష,పంచాయతీ కార్యదర్శి ఏ.సత్యనారాయణ,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.