
Bongoni Suresh
పేదలకు అందని ఇందిరమ్మ ఇండ్లు
బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్
ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులతో
కట్టేవి ఇందిరమ్మ ఇండ్లు పేరుతో
కాంగ్రెస్ కార్యకర్తల కేనా ఇందిరమ్మ ఇండ్లు
చేర్యాల రెవెన్యూ డివిజన్ పై కాలయాపన
చేర్యాల నేటిదాత్రి
జనగామ నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇండ్లలో నిరుపేదలకు అందని ద్రాక్ష ల ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నదని బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్ విమర్శించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను సమకూర్చి ప్రభుత్వానికి ఇస్తే ఇందిరమ్మ ఇండ్లు పేరుతో కట్టిస్తున్నారని విమర్శించారు మరియు నిరుపేదలైన ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందడం లేదని జనగామ నియోజకవర్గంలో చాలా తక్కువ మందికి ఇచ్చారని చేర్యాల మున్సిపల్ పరిధిలో కేవలం 34 మందికే ఇవ్వడం వీరి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుంది అని విమర్శించారు దానిలో కాంగ్రెస్ కార్యకర్తలు కు ఇందిరమ్మ ఇండ్లు అధికం వెనుకబడిన చేర్యాల ప్రాంతం పై మీరు చూపిస్తున్న ప్రేమ ఇదేనా అని విమర్శించారు మరియు చేర్యాల రెవెన్యూ డివిజన్ 100 రోజుల్లో తీసుకువస్తానని వెళ్లిన ముఖ్యమంత్రి ఇక్కడి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎటు పోయిందని విమర్శించారు చేర్యాల రెవెన్యూ డివిజన్ తీసుకొని తప్పక వస్తానని రెండోసారి ఎంపీ ఎలక్షన్లో మాట ఇచ్చిన చామల కిరణ్ కుమార్ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడి ప్రజలకు చూపిస్తున్నాడని విమర్శించారు ఇప్పటికైనా వెనుకబడిన చేర్యాల ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలు అందరికీ ఇవ్వాలని అన్నారు చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇంకా కాలయాపన చేయవద్దని అన్నారు