
— ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన
• వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి..
• అంగన్వాడీలో పౌష్టిక ఆహారం.
• ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
నిజాంపేట: నేటి ధాత్రి
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం నిర్మిస్తుందని, అలాగే ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో పర్యటించిన ఆయన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. అలాగే గ్రామంలో గల అంగన్వాడి కేంద్రాన్ని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు దశల వారిగా నేరుగా తమ అకౌంట్లోనే డబ్బులు జమవుతున్నయన్నారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించడం జరిగిందన్నారు. ప్రజలు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అలాగే వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా పాటించాలని సూచించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు పాలు, గుడ్లు , పౌష్టికాహారాన్ని అందిస్తుందన్నారు. పసిపిల్లలు గర్భిణి స్త్రీలు పౌష్టిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో రాజిరెడ్డి, గ్రామ కార్యదర్శి, గ్రామస్తులు ఉన్నారు.