
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఈనెల 13 నాటికి వేరిఫికేషన్ వంద శాతం పూర్తి కావాలి
సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు,
ఎంపీడీఓలు, ఎంపీఓలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల,రేషన్ కార్డుల వేరిఫికేషన్,భూభారతి దరఖాస్తుల పరిష్కరణ,వన మహోత్సవంలో నాటే మొక్కల ప్రగతి,సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 8750 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 4806 గ్రౌండింగ్ అయి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని , మిగిలిన ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వారంలోగా నిర్మాణ పనుల గ్రౌండింగ్ చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో ప్రోత్సహించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజరులో ప్రధానమంత్రి అవాస యోజన గ్రామీన్ (పీఎంఏవైజి)
పథకం క్రింద గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన ఇండ్ల వివరాలు పంచాయతీ సెక్రెటరీ లు సర్వే చేసి వెంటనే పీఎంఏవైజి ఆప్ లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణపు పనులు పూర్తి చేయడంలో జిల్లాను ముందు వరుసలో ఉంచాలని కోరారు.ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు కూడా అందిస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. లక్ష్యానికి అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఒక్కో మునిసిపల్, మండలాల వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరీలు తెలిపిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ విషయంలో వెనుకంజలో ఉన్న మండలాలను గుర్తించి, లక్ష్య సాధన కోసం అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.
ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో లబ్దిదారులను నేరుగా కలిసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలని, ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను నిశిత పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు నిధుల సమస్య ఎంతమాత్రం లేదని, నిర్మాణాలు చేపడుతున్న లబ్దిదారులకు ఆయా దశలను బట్టి వెంటవెంటనే వారి ఖాతాలలో నిధులు జమ చేయడం జరుగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ముగ్గు పోసి,ఇల్లు పునాది తీసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు.ప్రజాపాలన దరఖాస్తుల రేషన్ కార్డుల జారీ వేరిఫికేషన్ పై మునిసిపల్, మండలాల వారిగా. కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లావ్యాప్తంగా 58,841 దరకాస్తులలో 41,836 దరకాస్తులు వేరిఫికేషన్ పూర్తయిందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెల 13 నాటికి వేరిఫికేషన్ వంద శాతం పూర్తి కావాలని ఆదేశించారు. మీ సేవలో రేషన్ కార్డుల కొరకు జిల్లాలో 17866 దరకాస్తులు రాగా 7331 మంజూరు చేయడం జరిగిందని, మిగిలినవి వెంటనే వేరిఫికేషన్ చేయాలని సూచించారు.
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 31 లక్షల
మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించుటకు ప్రణాళిక ప్రకారం అనువైన ప్రదేశాన్ని గుర్తించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రణాళిక లను సిద్ధం చేసుకొని మన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు జియో కో-ఆర్డినేట్స్ తో ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో సెంట్రల్ మీడియన్ లలో పెద్దఎత్తున ప్లాంటేషన్ కు చర్యలు తీసుకోవాలని సూచించారు.భూ భారతి లో జిల్లావ్యాప్తంగా 50 850 వేల దరకాస్తులు రాగా అందులో 10 వేల 7 దరకాస్తులు మాత్రమే ఆర్ ఓ ఎఫ్ ఆర్ ప్రకారం చేయడం జరుగుతున్నదని,
మిగిలిన దరకాస్తులలో 47843 సాడబైనమా, ఇతర సమస్యలకు సంబంధించినవి ఉన్నాయని అన్నారు.ఆర్ ఓ ఆర్ పరిధిలో ఉన్న పదివేల దరఖాస్తులను ఆగస్టులో 15లోగా వేరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ఫాగింగ్ , పెద్ద ఎత్తున ఆయిల్ బాల్స్ అందుబాటులో ఉంచుకొని ఎక్కడైతే నీరు నిల్వ ఉండి దోమలు వ్యాపిస్తాయో అక్కడ ఆయిల్ బాల్స్ ఉపయోగించాలన్నారు. గ్రామాలలో ప్రతి ఫ్రై డే ను–డ్రై డే గా తూచా తప్పకుండా పాటించాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈఓ రామిరెడ్డి,డిఆర్డీఓ కౌసల్యాదేవి, గృహ నిర్మాణ శాఖ పిడి గణపతి, డిపిఓ కల్పన,రెవిన్యూ డివిజనల్ అధికారులు సత్యపాల్ రెడ్డి, రమాదేవి,మండల ప్రత్యేక అధికారులు,జిల్లా అధికారులు,మున్సిపల్ కమిషనర్లు,బల్దియా ఉప కమిషనర్, తహశీల్దార్లు, ఎంపిడిఓలు,ఎంపిఓలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.