Indiramma Sarees Distributed to Women
వెంకట్రావు పెళ్లి & ల్యాబర్తి గ్రామాలలో ఇందిరమ్మ చీరలను పంపిణీచేసిన…ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య
ఎక్కడ మహిళలు గౌరవించబడుతారో అక్కడ దేవతలు సైతం కొలువుదీరుతారంట.
కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం
అన్ని శక్తులలో బలియామైన శక్తి మహిళా శక్తి
వర్దన్నపేట (నేటిధాత్రి):
తెలంగాణ రాష్ట్ర మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలనే ఉద్దేశముతో సీఎం.రేవంత్ రెడ్డి గారీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు ఆదేశాల మేరకు ఈ రోజు వర్ధన్నపేట మండలంలోని, వెంకట్రావు పెళ్లి & ల్యాబర్తి,గ్రామలలో వర్ధన్నపేట ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్న గౌడ్ మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య & మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం & జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ మాట్లాడుతూ…
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని అన్నారు.
మహిళా ఉన్నతే-తెలంగాణ ప్రగతి అనే నినాదంతో రాష్ట్రంలోని మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఇంతకుముందు ప్రభుత్వములో మహిళలకు ప్రాధాన్యత ఎలా ఉన్నది ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ఎలా ఉందో మార్పును గమనించాలని కోరారు. గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాల్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు.
మళ్లీ ప్రజా ప్రభుత్వం వచ్చాక మహిళా సంఘాలను బలోపేతం చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వంలో దురదృష్టవశాత్తు మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే వారు తీసుకున్న రుణాన్ని తిరిగి వసూలు చేసే వారని, కానీ ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వంలో మహిళ ప్రమాద వశాత్తూ చనిపోతే తీసుకున్న రుణము మాఫీ చేయడంతో పాటుగా 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
పావలా వడ్డీ రుణాలు,మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులను చేయడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి లు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాల కల్పన ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా పెట్రోల్ పంపులు, వడ్డీ లేని రుణాలు, అద్దె ఆర్టీసీ బస్సుల నిర్వహన, మహిళా శక్తి క్యాంటీన్ లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పేదలకు తెల్ల రేషన్ కార్డులు , సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మహిళలు కుటుంబ బాధ్యతలు తీసుకుంటారని ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు మహిళలకే ఇస్తున్నట్లు చెప్పారు.
18 సంవత్సరాలు వయస్సు దాటిన ప్రతి మహిళా సంఘం సభ్యులకు ఉచితంగా ఒక చీర ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకంతం,మండల సమైక్య అధ్యక్షురాలు తక్కలపెల్లి ప్రమీల దేవి,గ్రామ మహిళా అధ్యక్షురాలు బొల్లం మణెమ్మ,చిదుముల్ల భాస్కర్ ,ఎండి వలి పాషా,సంకినేని దేవేందర్ రావు, మడత ప్రశాంత్ గౌడ్,మాజీ టెంపుల్ డైరెక్టర్ బండ సరిత,ఎర్రం లక్ష్మీనారాయణ,అడ్డగట్ట రాములు,ఎస్సీ సెల్ గ్రామాషాక సంకినేని గంగరాజు,గొట్టం భాగ్యమ్మ, మడి ద బిక్షపతి, అడ్డగట్ట సోమన్న,రావుల రవి,మిట్టపల్లి రమేష్,రావుల గంగయ్య,జడ రాజు,బొల్లం కుమార్,గొలుసుల మహేందర్,ఆకులపెల్లి డీలర్ వెంకటయ్య, ఆకుల పెళ్లి చేరాలు,కొయ్యేటి కుమార్,మాజీ ఎంపీటీసీ సూరారపు నిరంజన్, కాకర్ల ఎల్లయ్య,ఏనుగుల సోమయ్య,ఖమ్మంపాటి సంపత్,చిదుముల్ల నాగరాజు, బత్తినీ సంతోష్,సంకినేని జీవన్,రాయపురం శ్రీకాంత్,పత్తి పవన్,ఆకులపెల్లి శ్రీకాంత్,ముండ్లపెల్లి బన్నీ,చిదుముల్ల రాహుల్, మహిళా సంఘాల సభ్యులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
