ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల కట్టడాలను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగళ్ల గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారి తనప సుశీల ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పరు బేస్ మీట్ వరకు పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్న వీలైనంత తొందరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలను పూర్తి చేయాలని యజమానులు దగ్గరుండి మరి పరిశీలించి నాణ్యతగా కట్టుకోవాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ , మాజీ సర్పంచ్ పోలెబోయిన శ్రీ వాణి , తిరుపతయ్య గారు,యర్ర సురేష్ , రాందాస్ నాయక్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు