ఇందిరమ్మ ఇళ్ల పథకం.. లబ్ధిదారుల ఇబ్బందులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఈ పథకం అమలులో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు, సరఫరా సమస్యలు, నిర్మాణ వ్యయం పెరుగుదల వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పునాది రుణాలు, ఉచిత ఇసుక సరఫరా, నమూనా ఇళ్లపై స్పష్టత లేకపోవడం, ఐకేపీలపై అవగాహన లోపం సమస్యలుగా ఉన్నాయి. లబ్ధిదారులు ఈ సమస్యల పరిష్కారాన్ని కోరుతున్నారు. ఈ వారంలో రెండో విడత లబ్ధిదారుల జాబితా విడుదల కానుంది.