
BRS Party Convener Doddi Tatarao
ఐటీడీఏ ద్వారా నిరుపేద గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతరావు
నేటిధాత్రి చర్ల
ఐటీడీఏ ద్వారా గిరిజన కుటుంబాలకు అదనంగా మంజూరు అయిన 280 ఇళ్లను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి అర్హులైన ఎస్టీ కుటుంబాలకు మజురు చేయాలిని అల కాకుండా అధికార పార్టీ నాయకుల అనుచరులకు కానీ కమిటీలు సూచించిన లిస్ట్ ప్రకారం అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తే బిఆర్ఎస్ పార్టీ తరుపున కచ్చితంగా నిలదీస్తాం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా వెనకడబోము అని బిఆర్ యస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ ఎస్టీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు తుర్రం రవి కారం కన్నారావు తెలియజేసారు మొదటి విడతలో అధికార పార్టీ నాయకులే బహిరంగంగా లబ్ధిదారుల జాబితాలో కొంతమంది అనర్హులకు ఇల్లు కేటాయించారు అని విమర్శలు చేసుకున్న ఇళ్లు ఉన్న వారికే ఇళ్లు కేటాయించిన అధికారులు ఏమి పట్టనట్టే వున్నారు కనీసం ఈసారైనా మండలంలో వున్న నిరుపేద ఎస్టీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి అని బిఆర్ఎస్ పార్టీ తరుపున అధికారులకు తెలియజేస్తున్నామని ఈ విషయంలో గిరిజన నాయకులు కూడా కలిగించుకొని బీద గిరిజనులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నామని పత్రికా ప్రకటనలో తెలిపారు