జాలుగడ్డ తండాలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ
బాలానగర్ /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మండల పరిధిలోని జాలుగడ్డ తండాలో బుధవారం నూతన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ రాము నాయక్ లబ్ధిదారులకు ఈ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాము నాయక్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.పారదర్శకమైన పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి, ఈ పత్రాలను అందించామన్నారు. మంజూరైన నిధులతో లబ్ధిదారులు నాణ్యమైన ఇళ్లను నిర్మించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి నాయక్, కిషన్, సుప్రియ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తండావాసులు పాల్గొన్నారు.
