పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకంలో భాగంగా పట్టణంలోని తొమ్మిదవ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఇందిరమ్మ యాప్ ద్వారా డాటా సేకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ను నాలుగు విడతలుగా ప్రభుత్వం చెల్లిస్తుందని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమవుతుందని వారు వివరించారు.ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ మొగిలి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు దార్న వేణుగోపాల్,బండారి కృష్ణ,చిలువేరు చిరంజీవి లతోపాటు తొమ్మిదో వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి పాల్గొన్నారు.