చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మంగళవారం మండల కాంగ్రెస్ మండల శాఖ చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని అసమానతులను రూపుమాపడానికి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ అని ఆమె చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తూ ఆమె బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గొట్టే ప్రభాకర్, దారం రామచంద్రం, పులి సత్యం, చంటి ప్రసాద్, సంటి ఏసుదాస్, రవీందర్ రెడ్డి, పోతరాజు రవి, శంకర్, పులి నారాయణ తదితరులు పాల్గొన్నారు.