Indira Gandhi remembered as the Iron Lady of India
సంక్షోభాలను సవాళ్లను ఎదుర్కొని గెలిచిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ- వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, నేటిధాత్రి:
స్వాతంత్య్ర పోరాటయోధురాలు, దేశ మహిళా శక్తికి ప్రతీక నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయురాలు మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో ఆమహానీయురాలు చిత్రపటానికి వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ పేదల పక్షపాతి, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ఇందిరా గాంధీ అని, సంక్షోభాలను సవాళ్లను ఎదుర్కొని గెలిచిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి నివాళులు అర్పించామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆర్ష మల్లేశం, అనంతుల రమేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
