“Rangoli is an Ancient Indian Tradition: MPO Margavi”
భారతీయ సాంప్రదాయం ముగ్గుఎంపీఓ _మార్గవి
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నడికూడ మండలం ఎంపీఓ మార్గవి విచ్చేసి మాట్లాడుతూ ముగ్గు అనేది ఇంటి వాకిలి ఇంటి లోపల అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం అని అన్నారు.ఇంటి ముందు పేడ నీటితో కల్లాపి జల్లి తడిగా ఉండగానే పిండితో ముగ్గులు వేస్తారనీ,ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తారనీ,గచ్చులు వేసిన ఇంటి వెలుపలి,లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళను గాని,సుద్ధముక్కలను గాని తడిపి వేస్తారని అన్నారు. ఆధునిక కాలంలో ఇంటి లోపలి ముగ్గులు కొందరు పెయింట్‌తో వేస్తున్నారని ఇవి రోజు వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయని కొన్ని రకాల పింగాణి పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో మధ్యన అంచుల వెంబడి వేసుకుంటున్నారని అన్నారు.
ప్రైవేటుకు దీటుగా చర్లపల్లి పాఠశాల
నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల ఫోటోతో కూడిన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కున్సోత్ హనుమంతరావు,ఎంపీ ఓ మార్గవి విచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులతో కూడిన క్యాలెండర్ ను ముద్రించడం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పనిచేస్తుందని నిదర్శనమని అన్నారు అంతేకాకుండా పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో లకవత్ దేవ,పుల్లూరి రామకృష్ణ పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి చైర్మన్ కందికట్ల రమ,అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మి నందిపాటి సంధ్య తదితరులు పాల్గొన్నారు.
