
భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలంలో ఇండస్ట్రియల్ ఏరియాలో రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ భద్రాచలం మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య చికిత్స కేంద్రం మరియు మందుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు భీమవరపు వెంకటరెడ్డి, లైన్స్ క్లబ్ మెంబర్ డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు, డాక్టర్ చంద్రప్రసాద్, డాక్టర్ చావా యుగేందర్, వై సూర్యనారాయణ, ఇండస్ట్రియల్ ఏరియా ప్రెసిడెంట్ వాతాడి దుర్గారావు, ప్రోగ్రాం చైర్మన్ అనుగోజు నరసింహ చారి, ఉమా శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు