ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ.

Society

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ
ఆధ్వర్యంలో… పారిశుద్ధ్య కార్మికులకు టిఫిన్ బాక్సుల పంపిణీ….

మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ మహిళ పరిశుద్ధ కార్మికురాలికి ఘనంగా సన్మానం..

రామాయంపేట మార్చి 8
నేటి ధాత్రి(మెదక్)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నాడు రామాయంపేట పట్టణంలో ఉన్న మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ మహిళ పరిశుద్ధ కార్మికురాలికి సన్మానం… అలాగే 18 మంది మహిళా పరిశుద్ధ కార్మికురాళ్ల కు వారి సేవలకు గుర్తింపుగా స్టీల్ టిఫిన్ బాక్స్ ల పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా శాఖ అధ్యక్షుడు ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు టిఫిన్ బాక్సులను అందజేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దెమే యాదగిరి మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అన్ని రకాల చర్య లు చేపడుతుందనీ తెలిపారు. గతంలో తాను కూడా వార్డు సభ్యునిగా, కౌన్సిలర్ గా ఉన్న సమయంలో పేదలకు సేవా కార్యక్రమం ద్వారా ఆదుకున్నట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి డి.జి. శ్రీనివాస శర్మ, వైద్య శిబిరాల నిర్వాహన చైర్మన్ దామోదర్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మద్దెల సత్యం, మద్దెల రమేష్, పాతూరు సిద్ధ రాములు, దారం రమేష్, సతీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!