IMF Says India Is Key Driver of Global Economic Growth
ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ కీలక పాత్ర: ఐఎంఎఫ్
ప్రపంచ వ్యాప్తంగా ఆయాదేశాల్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ ముఖ్య పాత్ర పోషించిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అభిప్రాయపడింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో భారత్ గ్రోత్ ఇంజిన్ వంటిదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) పేర్కొంది. ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జూలీ కోజాక్ వాషింగ్టన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ మూడవ త్రైమాసికంలో (Q3) అంచనాల కంటే మెరుగైన వృద్దిని నమోదు చేసిందని జూలీ కోజాక్ పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2025-26 భారత్ వృద్ధి రేటును అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది. అయితే, మరికొన్ని రోజుల్లో విడుదల చేయబోయే ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్’ అప్ డేట్ లో భారత్ వృద్ధి అంచనాలను సవరిస్తామన్నారు. భారత్ వృద్ధికి ప్రధానంగా దేశీయ వినియోగం (Domestic Consumption), పెరిగిన ప్రభుత్వ పెట్టుబడులు వెన్నుముకగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
