-భారత్ అభివృద్ధి..రైతు సంక్షేమం..నరేంద్రుడితోనే సాధ్యం
-బీజెపి మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు చేవ్వ శేషగిరి యాదవ్
మొగుల్లెపల్లి నేటి ధాత్రి
భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషితోనే భారత్ విశ్వ గురువుగా అవతరించబోతుందని, భారత అభివృద్ధి..రైతు సంక్షేమం నరేంద్రుడుతోనే సాధ్యమని భారతీయ జనతా పార్టీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు చేవ్వ శేషగిరి యాదవ్ అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ 238, 239, 240 బూత్ కమిటీల ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు భారీ ఊరటనిచ్చే పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రైతులు ఎక్కువగా వినియోగించుకునే డీఏపీ ఎరువుపై అదనపు రాయితీ కింద 3,350 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. దాంతో ఇప్పుడు కేవలం రూ.1,350 50 కిలోల డిఏపి ఎరువుల బస్తా రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే పంటల బీమా పథకాలను రూ.69.515 కోట్లకు రాయితీని పెంచి..రైతులను ఆదుకుంటూ..పెట్టుబడి ఖర్చులను ఆదా చేస్తూ..రైతులకు అండగా నరేంద్రుడు పాలన కొనసాగిస్తున్నాడన్నారు. రైతు రాజ్యమే..ప్రధాని నరేంద్రుడి లక్ష్యంగా శేషగిరి యాదవ్ అభివర్ణించారు. ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల తిరుగుబాటు మొదలైందని, ప్రజా సమస్యలే ఎజెండాగా..బూత్ స్థాయి నుండే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుకు పోవాల్సిన అవసరముందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మూడు అడుగుల ముందుకు..ఏడు అడుగుల వెనక్కి అనే చందంగా..కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలనలు దొందు దొందే అనే చందాన ఉన్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినప్పటికీ, పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ప్రకటించని అసమర్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, సీఎం రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయని..చేతులు మాత్రం గడపలు దాటడం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలన నాణానికి బొమ్మ, బొరుసు లాగా దొందు దొందు లాగా ఒకటే రకమని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని మట్టి కర్పించి భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించనున్నట్లు ఆయన అభివర్ణించారు. అనంతరం బూత్ కమిటీలను ఆయన ప్రకటించారు. 238వ బూత్ కమిటీ అధ్యక్షుడిగా పొన్నాల శివారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, 239వ బూత్ కమిటీ అధ్యక్షుడిగా బీనవేణి ఓదాకర్, ప్రధాన కార్యదర్శిగా అడిగిచర్ల రాజేశం, 240వ బూత్ కమిటీ అధ్యక్షుడిగా యార సందీప్, ప్రధాన కార్యదర్శిగా గాజుల రాజేష్ లను ఎన్నుకున్నట్లు శేషగిరి యాదవ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షుడు పెండ్లి మల్లారెడ్డి, యువమోర్చ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీధర్ గౌడ్, బిజెపి నాయకులు యార రాజిరెడ్డి, పెండ్లి సంజీవరెడ్డి, పొన్నాల శ్రీనివాస్, పెండ్లి అశోక్, గాజుల శివ, ఊరుకొండ ఓదెలు తదితరులు పాల్గొన్నారు.