6వ రోజుకు చేరిన సివిల్ సప్లై హమాలీల నిరవధిక సమ్మె

హమాలీల సమస్యలు పరిష్కరించాలి

సమ్మె శిభిరాన్ని సందర్శించిన సీపీఎం నాయకులు

పరకాల నేటిధాత్రి
సివిల్ సప్లై హమాలీల ఎగుమతి దిగుమతి రేట్ల ఒప్పందం ప్రకారం జీవో విడుదల చేయాలని సివిల్ సప్లై కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో పరకాల సివిల్ సప్లై గోదాం వద్ద కార్మికులు సమ్మె చేపట్టారు.బొచ్చు కళ్యాణ్ సీపీఎం పట్టణ కార్యదర్శి,మడికొండ ప్రశాంత్, ఈశ్వర్ లు సందర్శించి ప్రభుత్వం తక్షణమే డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ హమాలీల వేతన పందాన్ని వెంటనే అమలు చేయకపోవడం తో 2025 జనవరి 1నుండి రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై మరియు జిసిసి హమాలీల కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్ల ఒప్పందం 2023 డిసెంబర్ తో ముగిసింది 2024,2025 నూతన రేట్ల ఒప్పందాన్ని కోసం హమాలీ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అనేక దఫాలుగా విన్నవించిన నేపథ్యంలో నూతన రేట్లు మరియు ఇతర సమస్యల పరిష్కారానికి 10 నెలల తర్వాత 3అక్టోబర్ 2024 న అన్ని కార్మిక సంఘాల సమక్షంలో చర్చలు జరిపి ఎగుమతి దిగుమతి నూతన రేట్లు ప్రస్తుతం ఉన్న 26 నుండి 29 రూపాలుగా అనగా 3రూపాయలు పెంచారని ఈ పెరిగిన రేట్లు 2024 జనవరి నుండి అమలు చేస్తామని ఏరియాస్ తో సహా చెల్లిస్తామని,మహిళా కార్మికులకు గోధుమల సామర్ధ్యాన్ని బట్టి ప్రస్తుతం ఇస్తున్నా వేతనం పైన 1000అదనంగా పెంచుతామని,బోనస్ 6,500 నుండి 7500కు,యూనిఫామ్ స్టిచ్చింగ్ చార్జి 1300 నుండి 1600 వరకు,హమాలీలకు పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని ఇతర సమస్యల పరిష్కరిస్తామని కమిషనర్ సంబంధిత అధికారులు అంగీకరించడం జరిగిందన్నారు.పై హామీలన్నీ వారం రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చిన సివిల్ సప్లై అధికారులు మూడు నెలలు గడిచిన ఒప్పందం ప్రకారం నేటికీ కనీసం జీవో విడుదల చేయలేదని గత ఒప్పందాల సందర్భంలో చర్చలు జరిగిన తర్వాత జీవో విడుదల చేసి వెంటనే పెరిగిన రేట్ల ప్రకారం ఏరియర్స్ అందించడం జరిగేదని గత ఒప్పందాలకు భిన్నంగా సంవత్సరం కాలం గడిచిన నేటికి హమాలీల సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం హమాలీలను ఆర్థికపరంగా నష్టపరచడమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు గడ్డం సురేష్, మచ్చ శంకర్,సందీప్,కృష్ణ, బిక్షపతి,చంద్రమౌళి,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!