
పనిగంటలు పెంచడమంటే కార్మికుల వ్యక్తిగత జీవితాలను హరించడమే.
మందమర్రి నేటి ధాత్రి
పెట్టుబడిదారుల ఖజానా నింపడానికి కార్మికవర్గాన్ని బానిసలుగా మారుస్తారా?
రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని గంటలు పెంచుతు తెచ్చిన జీవో నెం 282 ను వెంటనే రద్దు చేయాలి.
జీవో రద్దు చేయాలని నల్లారిబ్బన్నలతో విధులు నిర్వహిస్తున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులు.
గందం రవి
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు మందమర్రి డివిజన్ అధ్యక్షుడు.
రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుబడిదారుల, కార్పొరేటర్ల ఖజానా నింపడానికే 10 నుంచి 12 గంటల పనిగంటలు పెంచుతు బిజెపి మోడీ ప్రభుత్వానికి తానేమి తక్కువ కాదన్నట్టు జీవో నెం 282 ను విడుదల చేశారు. కార్మికవర్గాన్ని బానిసలుగా మార్చే పని గంటల పెంపు జీవోను వెంటనే రద్దు చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మందమర్రి డివిజన్ పరిధిలోని రామకృష్ణపూర్ ఏ-జోన్ సివిక్ కాంట్రాక్టు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా గందం రవి ఎస్సీ కేఎస్ సిఐటియు డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతూ…
సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు ఇప్పటికే పనిభారం పెరుగుతుంది. చేసే పనికి వచ్చే వేతనాలకు గొర్రెతోక బెత్తెడు చందంగా మా వేతనాలు ఉన్నాయి. మరోవైపు రోజు రోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవ్వని కలిసి ఇప్పటికే కార్మికుల బతుకులు ఆగమ్యగోచరంగా మారి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతుంటే, ఇవేవి పరిష్కరించకుండా, వేతనాలు పెంచకుండా పైగా 10 నుంచి 12 గంటల పని చేయాలని జీవో నెంబర్ 282 ను విడుదల చేయడమంటే కార్మిక వర్గంపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత కర్కషంగా వ్యవహారిస్తుందో అర్థం అవుతుంది. మమ్మల్ని బానిసలు, మా వ్యక్తిగత స్వేచ్ఛ జీవితాలను హరిస్తామంటే కార్మికులంత ఐక్యంగా రైతాంగ పోరాట స్పూర్తితో మరో మహత్తర పోరాటానికి సైతం సిద్ధమైతాము.
ఈ కార్యక్రమంలో శారధ, లక్ష్మి, స్వరూప, రాజేశ్వరి, అంజలి, రవీందర్, సంపత్, రాజేందర్, వెంకటేశ్వర్ రావు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.