*ఆన్ మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కిరణ్ గౌడ్*నేటి ధాత్రి మొగుళ్ళపల్లి
టిజి ఎన్పిడిసిఎల్ కంపెనీలో విద్యుత్ ఆన్ మ్యాన్డ్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న ఆన్ మ్యాన్డ్ కార్మికుల వేతనాలు పెంచడం హర్షనీయమని తెలంగాణ విద్యుత్ ఆన్ మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కిరణ్ గౌడ్ ఆశభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆన్ మ్యాన్డ్ వర్కర్లకు కొంతమేర జీతాలు పెరగడం సంతోషమని గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను రెగ్యులరైజ్ చేస్తామని కొంతమందిని మాత్రమే ఆర్టిజన్లుగా గుర్తించడం జరిగిందని ఆన్ మ్యాన్డ్ వర్కర్లను విస్మరించడం జరిగిందని ఆన్ మ్యాన్డ్ వర్కర్లు రెగ్యులర్ ఎంప్లాయిస్ తో సమానంగా పనిచేస్తున్నప్పటికి ఈపిఏప్, ఈఎస్ఐ లేదని సాకుతో ఆర్టిజన్లుగా గుర్తించలేకపోయారని రెగ్యులర్ అయ్యేంత వరకు ఇదే ఐకమత్యంతో పోరాడాలని ఆన్ మ్యాన్డ్ కార్మికుల సీల్డ్ వేతనాల పెంపుదలకు కృషి చేసిన ప్రభుత్వానికి, యాజమాన్యానికి ఎన్పిడిసిఎల్ సిఎండీ కర్నాటి వరుణ్ రెడ్డికి,ఐఎన్టియుసి 327 యూనియన్ సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్,సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ టిఆర్వికే ఎస్ అధ్యక్షులు జాన్సన్, 1104యూనియన్ పెద్దలు సాయిబాబలకు ఆన్ మ్యాన్డ్ కార్మికుల తరుపున కిరణ్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
విద్యుత్ ఆన్ మ్యాన్డ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం హర్షణీయం
