
కల్వకుర్తి/నేటి ధాత్రి
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ, కల్వకుర్తి చారకొండ, ఉర్కొండ తదితర మండలాలలో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో పనులకు వెళ్లే కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెల్దండ మండలం రాచూరు గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చలిగాలులు వీస్తుండడంతో పశువులు వణుకుతున్నాయి. పొలాల వద్ద రైతులు చలిమంటలు వేసుకొని సేద తీరుతున్నారు. ఈ వర్షంతో వరి నాట్లు వేయడానికి అనుకూలంగా ఉండగా.. వేరుశనగ పంటలకు తెగుళ్లు సోకుతాయని రైతులు అన్నారు. ఇతర గ్రామాలకు ప్రయాణించే వాహనదారులు వర్షంలో తడుస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.