నర్సంపేట,నేటిధాత్రి :
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 2024-25 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 10/10 జీపీఏ సాధించిన గౌడ విద్యార్థులకు హన్మకొండలోని సర్దార్ సర్వాయి పాపన్న,కౌండిన్య పరపతి సంఘాల ఆధ్వర్యంలో ప్రోత్సాహ బహుమతులు అందిస్తున్నట్లు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెంది, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ గురుకులాల్లో చదివి పదవ తరగతిలో 10/10 మార్కులు సాదించిన నిరుపేద గౌడ విద్యార్థులు మాత్రమే ఈ ప్రోత్సాహ బహుమతులకు అర్హులని తెలిపారు. దీనికి గాను 10,వ తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డ్, కులం సర్టిఫికెట్స్ కాపీలు హన్మకొండ నయీమ్ నగర్ లోన్గల మోషన్ కళాశాలలో అందజేయాలని ఆయన వివరించారు.హన్మకొండ హంటర్ రోడ్ లో గల గౌడ హాస్టల్ నందు ఈ నెల 29 న విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు పరపతి సంఘాల అధ్యక్షులు అంబాల సూర్య నారాయణ గౌడ్, కార్యదర్శి గట్టు సత్యనారాయణ గౌడ్, కన్వీనర్ తండ నాగయ్య గౌడ్ ల ఆధ్వర్యంలో అందజేస్తారన్నారు. మరిన్ని వివరాలకు 9701275354 నెంబర్ కు సంప్రదించాలని రమేష్ గౌడ్ తెలిపారు.