
హన్మకొండ, నేటిధాత్రి:
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పగిడాల కాళీప్రసాద్ తో నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.
మెడికల్ విభాగంలో డాక్టర్ల చేత ఎన్నుకోబడి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినందుకుగాను అదేవిధంగా మెడికల్ విభాగం విలేకరులకు సపోర్ట్ చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఉచితంగా వైద్యం అందిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ ఖాళీప్రసాద్ కి నేటిధాత్రి విలేకరులు కృతజ్ఞతలు తెలియజేశారు, డాక్టర్ తో నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషకరమని విలేకరులు అన్నారు. డాక్టర్ కాళీప్రసాద్ మాట్లాడుతూ నేటిధాత్రి పత్రిక ప్రజల సమస్యల మీద పోరాడుతుందని అక్రమార్కుల మీద వార్తలు రాస్తుందని మెడికల్ విభాగంలో మా సహాయం తప్పకుండా ఉంటుందని డాక్టర్ ఖాళిప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో విలేకరులు కుమార్ మరియు మధు పాల్గొన్నారు