మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
సహకార సంఘం ద్వారా సకాలంలో రైతులకు రుణాలు, ఎరువులు రాయితీపై అందజేస్తున్నామని సహకార సంఘం అధ్యక్షులు మాడెమోని నర్సింలు అన్నారు. శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకొని జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని యన్మన్ గండ్ల పీఏసీఎస్ కార్యాలయంలో జెండావిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఏసీఎస్ ద్వారా ఎంతో మంది రైతులు, చిరువ్యాపారులకు రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా రైతులకు కోట్లాది రూపాయల రుణాలు అందజేశామన్నారు. కార్యక్రమంలో కో-ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్లు కే. ప్రతాప్,కే.శశిధర్ రెడ్డి, ఆర్. వెంకటేష్, అంకం ఆంజనేయులు, ఎం.కృష్ణయ్య, మాజీ సర్పంచ్ గోపాల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.