నేటిధాత్రి, వరంగల్ తూర్పు
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో, నషా ముక్త్ భారత్ అభియాన్ లో బాగంగా, దేశ వ్యాప్తంగా 41 ఏటిఎఫ్ సెంటర్ల ప్రారంభ కార్యక్రమం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ వర్చువల్ పద్దతిలో ఢిల్లీలో ప్రారంభం చేశారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ను వర్చువల్ పద్దతిలో ప్రారంభం చేసే కార్యక్రమం కోసం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీన్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎంజీఎం హాస్పిటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంజీఎం సుపరిండెంట్ డా. చంద్రశేఖర్, కేఎంసి ప్రిన్సిపాల్ డా. మోహన్ దాస్, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంట రవి కుమార్, బీజేపీ జిల్లా నాయకులు కుసుమ సతీష్, బాకం హరిశంకర్, ఎంజీఎం హాస్పిటల్ వైద్యులు, ఎంజీఎం హాస్పిటల్ నర్సులు తదితరులు పాల్గొన్నారు.