వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రైతులు కొనుగోలు కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి. పి ఏ సి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు …………
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలోరంగాపురం, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొరికిశాల, మొట్లపల్లి గ్రామాలలో. ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిఎసి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు తో కలిసి ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యాన్ని తూకం వేశారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న 5 వందల బోనస్ పొందాలని రైతులు ధాన్యంలో. తాలు, మట్టి గడ్డలు లేకుండా. తెమ శాతం తక్కువగా ఉండేవిదంగా చూసుకోవాలి.

పిఎసిఎస్ సిబ్బంది హమాలీల కొరత లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించిన మిల్లులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని మీ ఇష్టానుసారం మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఆ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈగతసీజన్ లో జిల్లాలో రైతులకు 30 కోట్ల బోనస్ ఇచ్చామని రైతులవద్ద ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లో. ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అధికారులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ. రవి, తహసీల్దార్, జాలి సునీత, ఎంఎఓ. సురేందర్ రెడ్డి, చిట్యాల ఎఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు, మోటె ధర్మారావు, తక్కళ్లపెల్లి రాజు,క్యాతరాజు రమేష్, పోల్నేని లింగారావు, బక్కిరెడ్డి, శివారెడ్డి, గుండారపు తిరుపతి, లింగయ్య, సొసైటీ డైరెక్టర్లు నాయకులు రైతులు పాల్గొన్నారు.