దళిత స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
చిట్యాల, నేటిధాత్రి :
సోమవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి మ్యాదరి సునీల్ అద్యక్షతన సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ లు* మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు ప్రభుత్వాలు మారినా అధికారులు మారిన దళితులపై దాడులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న అనేక సంఘటనలు అరికట్టుటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో నుంచి విఫలం అయినందున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పై చేసిన జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు వేంటనే దళిత స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు* రాబోయే రోజుల్లో గ్రామాల్లో దళితులపై దాడులు దౌర్జన్యాలు అదికంగా జరుగుతాయని వారు అన్నారు అందుకే అంబేద్కర్ సంఘం నాయకులు గ్రామ స్థాయి నుంచి దళిత బడుగు బలహీన వర్గాలను చైతన్య వంతులను చేస్తు గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేయాలన్నారు. అందుకే చిట్యాల మండల కమిటీని ఈనెల 22 శుక్రవారం రోజున ఎన్నుకోవడం* జరుగుతుందని మండల వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వాదులు మేదావులు ఉద్యోగులు శ్రేయోభిలాషులు మిత్రులు కుల మతాలకు అతీతంగా SC,ST BÇ మైనారిటీ* కులాలు కమిటీ ఎన్నికకు హాజరు కావాలని వారు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ మండల సాంస్కృతిక కార్యదర్శి వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ మండల నాయకులు సరిగొమ్ముల రాజేందర్ గుర్రపు తిరుపతి శీలపాక ప్రణిత్ కట్కూరి రాజు తదితరులు పాల్గొన్నారు.