BJP Protests CM’s Remarks on Hindu Gods
హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు
– బిజెపి పట్టణ అధ్యక్షులు
దుమాల శ్రీకాంత్
సిరిసిల్ల (నేటి ధాత్రి):
హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలను చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే సహించేది లేదని బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భాజాప పట్టణ శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి హిందూ భావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అర్హత లేనిదని బాధ్యత రాహిత్యమని హిందూ సమాజం శాంతిని ప్రేమిస్తుంది కానీ అవమానాన్ని అస్సలు సహించదని అన్నారు. ఇకపై ఎవరైనా హిందూ దేవుళ్ళపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే బిజెపి ఆధ్వర్యంలో అత్యంత తీవ్రంగా ఖండించే చర్యలు చేపడతామన్నారు. హిందూ సమాజ ఏకతను బలంగా ప్రదర్శించడం బిజెపి కార్యకర్తలు ప్రజల నుండి, విస్తృతంగా స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, సీనియర్ నాయకులు గూడూరు భాస్కర్, పట్టణ ఉపాధ్యక్షులు మొర శ్రీహరి, అంకారపు రాజు, కొండ ప్రతాప్,పట్టణ ప్రధాన కార్యదర్శి పల్లికొండ నరసయ్య, మెర్గు శ్రీనివాస్, కొండ నరేష్, అధికార ప్రతినిధులు మోర రవి, వేముల ఆంజనేయులు, చొప్పదండి శ్రీనివాస్, గూడెం సురేష్, సూరం వినయ్, సిద్ధి దేవరాజ్, ఇంజపురి మురళి, గాలి శ్రీనివాస్, చొక్కి శ్రీనివాస్, రచ్చ రాహుల్, వడ్నాల శేఖర్, వెలిశాల అభినయ్, వూరగొండ రాజు, కనకయ్య, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
