వనపర్తి నేటిదాత్రి;
వనపర్తి పట్టణంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో పండుగల సందర్భంగా తెల్ల బెల్లం ప్రజలకు కిలో 50 రూపాయల విక్రయించాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ వర్తకులను కోరారు . ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ వర్తక సంఘంలో బెల్లం విక్రయాల గురించి తనిఖీ చేశామని తెలిపారు . తెల్ల బెల్లం అమ్మకాలు ప్రభుత్వం నిషేధించలేదని ఎవరైనా అమ్ముకోవచ్చని వర్తక సంఘం పేరుతో బెల్లం బయటి ప్రాంతాల నుంచి తెప్పించి చిన్న కిరాణా వ్యాపారులకు బెల్లం సరఫరా చేసి ప్రజలకు అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు . చేసుకుంటున్నారని తెలిపారు గతంలో వర్తక సంఘం పేరుతో బయటి ప్రాంతం నుంచి బెల్లం లారీ తెప్పించి కిరాణము వ్యాపారులకు అధిక ధరలకు విక్రయించాలని చూస్తే గతంలో ఎక్సైజ్ సీఐ సుభాష్ చంద్ర రావు లారీని సీజ్ చేశారని సతీష్ యాదవ్ గుర్తు చేశారు . అప్పట్లో అఖిలపక్ష ఐక్యవేదిక వర్తక సంఘంలో బెల్లం ఉన్నట్లు తెలిసి పోరాటం చేస్తే వర్తక సంఘానికి ఎక్సైజ్ శాఖ ఇలాంటి అనుమతులు ఇవ్వలేదని సీఐ సుభాష్ చంద్ర రావు చెప్పారని సతీష్ తెలిపారు . ప్రతి కిరాణము షాపులో ప్రజలకు 90 కిలోల తెల్ల బెల్లం అమ్ముకోవచ్చని ఎక్సైజ్ అధికారులు చెప్పారని అన్నారు కొందరు కిరాణం వ్యాపారులు నల్ల బెల్లం పటికి నవ సాగరం సారా తయారు చేసే వారికి అమ్మకాలు జరపడంతో కొంద రు కిరాణాము వ్యాపారులను బైండ్ వర్ చేశారని సతీష్ యాదవ్ పేర్కొన్నారు అధికారుల ను అడిగి తెల్ల బెల్లం విక్రయాలు జరిపామని వర్తకులు అన్నారని సతీష్ యాదవ్ తెలిపారు వనపర్తి లో తెల్ల బెల్లం అమ్మకాలు ఎవరైనా అమ్ముకోవచ్చనని పక్క జిల్లాలైన నాగర్ కర్నూల్ గద్వాల్ హైదరాబాద్ ప్రాంతాల్లో తెల్ల బెల్లం విక్రయాలు ఉన్నాయని వనపర్తి లో తెల్ల బెల్లం అమ్ముకొనుటకు అధికారులు ఇబ్బందుల కు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు వనపర్తి జిల్లా లో తెల్ల బెల్లం అమ్మకాలపై జిల్లా కలెక్టర్ ను ఎక్సైజ్ అధికారులకు అఖిలపక్షం ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇస్తామని సతిష్ యాదవ్ పేర్కొన్నారు తెల్ల బెల్లం అమ్మకాలపై ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని వర్తక సంఘానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేశారు
వనపర్తి లో వర్తక సంఘం ప్రజలకు 50 రూపాయల కిలో బెల్లం విక్రయించాలి
