కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 100 మంది నాయకులు మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరిక.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం
బాలానగర్ మండలం పెద్దరేవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన 100 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు జడ్చర్ల లోని ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ… మా గ్రామంలో అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హయాంలోనే జరిగిందని తెలిపారు. మేమందరం ఏకతాటిపైకి వచ్చి అభివృద్ధికి మద్దత్తు పలుకుతూ కారుగుర్తుకు ఓటు వేసి లక్ష్మారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు.