కొప్పుల ఈశ్వర్ సమక్షం లో బారాస లో బారీ చేరికలు

తరలి వచ్చిన ప్రజానీకం,!!! కొప్పుల ఈశ్వర్ కె మా మద్దతు అంటూ హామీ!!

ఎండపల్లి, నేటి ధాత్రి,

ధర్మపురి.నియోజక వర్గం ధర్మారం మండలంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ధర్మారం కు చెందిన ఎన్ఆర్ఐ లు దాయేటి ఉదయ్ కుమార్, పవన్ రావు, పెరుమాల్ల ప్రసాద్ రావు ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. సొంత ఊరు పై ఉన్న మమకారంతో అభివృద్ధి కోసం బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు.‌ బోట్ల వనపర్తి మాజీ సర్పంచ్ ధరనేని ఓదెలు యాదవ్, బోట్ల లక్ష్మయ్య, మర్రి రమేష్ ఆధ్వర్యంలో 50 మంది బీఆర్ ఎస్ లో చేరారు.నర్సింహుల పల్లె గ్రామ సర్పంచ్ పంపాలా మధుకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ కి చెందిన 20 మంది బీఆర్ఎస్ లో చేరారు. దొంగతుర్తి కి చెందిన పద్మశాలి సంఘం సభ్యులు, బీజేపీ కార్యకర్తలు 50 మంది గులాబీ పార్టీలోకి చేరారు.


బీఆర్ఎస్ లో చేరిన వారందరికి మంత్రి కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యం లో నే అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు.రానున్న ఎన్నికల్లో మరోసారి బీఆర్ ఎస్ గెలుపు నకు అందరూ సహకారం అందించాలని కోరారు. పార్టీ లో చేరిన వారికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం లో ధర్మారం, పెగడపల్లి జెడ్పి టీసి సభ్యులు పుస్కూరి పద్మజ, రాజేందర్, ఎంపిపి కరుణ శ్రీ,, మండల టీఆరెఎస్ అధ్యక్షులు రాచురి శ్రీధర్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!