ఎన్నికల్లో ఏకపక్ష తీర్పు ఇవ్వండి
శాయంపేట నేటి ధాత్రి;
వరంగల్ పార్లమెంట్ బి ఆర్ ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పరకాల మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ మారపెల్లి నందం అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడుతున్నారని అన్నారు. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్న పంటలు చూసి దుఃఖిస్తున్న రైతన్నలు బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిందని గుర్తు చేశారు. ఎంపీగా సుధీర్ కుమార్ గెలిస్తే పార్లమెంటులో కొట్లాడి ఉమ్మడి జిల్లాకు నిధులు తీసుకొస్తారని అన్నారు. రైతులను ఆదుకుంటారని తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు తోడుదొంగలని అన్నారు. వారి స్వలాభం కోసం పార్టీలు మారి ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.