పవిత్ర రంజాన్ మాసంలో, దారుణం.

Ramadan

పవిత్ర రంజాన్ మాసంలో, దారుణం.

అబ్రస్తాన్ మినార్ లను ధ్వంసం చేసిన దుండగులు.

మత సామ్రస్యానికి ప్రతీకంగా ఉన్న మహాదేవపూర్ లో దారుణం.

మీనార్ ల ధ్వంసం ముస్లిం సమాజాన్ని గాయపరిచింది.

ఖబ్రస్తాన్ మీనార్ లపై దుండగల దుశ్చర్య, పోలీస్ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలి.ముస్లింలు.

మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తే చర్యలు తప్పవు, ముస్లింలకు పోలీస్ భరోసా,

Ramadan
Ramadan

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

మతసామ్రస్యానికి మారుపేరు మహాదేవపూర్, దశాబ్ది కాలం నుండి కులాలు మతాలు అనే వ్యత్యాసం లేకుండా మానవత్వమే తమ కులం గా భావిస్తూ కలిసికట్టుగా జీవిస్తున్న మహా మండల కేంద్రానికి, ఏమైందో తెలవదు కానీ, ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఖబ్రిస్తాన్ గేట్ వద్ద ఉన్న రెండు మీనార్ లను ధ్వంసం చేయడంతో, తెల్లవారుజామున చుట్టుపక్కల ఉన్నవారు గమనించి మైనారిటీలకు సమాచారం ఇవ్వడం జరిగింది. ముస్లింలు పవిత్రంగా భావించే ఖబరస్తాన్ ప్రధాన గేటు వద్ద ఉన్న మినార్లు గత 15 రోజుల క్రింద ఏర్పాటు చేయడం జరిగింది. మీనార్ల ను ధ్వంసం చేసిన సమాచారం తెలవగానే పెద్ద మొత్తంలో మైనార్టీలు కబ్రిస్తాన్ వద్దకు చేరి చూడగా ప్రధాన గేటు వద్ద అమర్చిన రెండు మీనార్లను 50% వరకు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి ఉండడంతో ముస్లిం మైనార్టీలు మనస్థాపానికి గురికావడం జరిగింది. తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది.

పవిత్ర రంజాన్ మాసంలో, దారుణం.

Ramadan
Ramadan

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహాదేవపూర్ మండలం అనేక సంవత్సరాలుగా ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ మతాల మధ్య ద్వేషాలు చిచ్చు లాంటి సంఘటనలు మండలంలో ఎన్నడు చోటు చేసుకోలేదు, అన్న విషయం, ప్రజలతో పాటు పోలీస్ రికార్డులో కూడా మహాదేవపూర్ మండల ప్రజల మధ్య ఉన్న ఐక్యత సూత్రాలుగా చెప్పుకోవచ్చు.

అలాంటి మండలంలో పవిత్ర రంజాన్ మాసం లో సోదర భావంగా మెలిగే ప్రజల మధ్య అబ్రస్తాన్ మీనార్ల ధ్వంసం లాంటి దారుణ వ్యవహారం తెరపైకి రావడం ముస్లిం సమాజంలో కాస్త నిరాశను కల్పించింది.

స్థానిక ముస్లిం గ్రామ పెద్దలు గుర్తు తెలియని వ్యక్తుల విశ్చర్యపై స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ముస్లిం గ్రామ పెద్దలు మండల కేంద్రానికి సంబంధించిన ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలను వాస్తవాలను పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది.

మండలంలో ఇలాంటి దారుణాన్ని కూడగట్టడం ముస్లింలను ఆవేదనకు గురి చేసిందని గ్రామ పెద్దలు పోలీసులకు వివరించారు.

కుల మత తేడా లేకుండా మానవత్వమే తమ మతంగా దశాబ్దాలుగా ముందుకు వెళుతున్న మండల కేంద్రంలో ఇలాంటి దారుణాన్ని పురుడు పోసిన వారిని కఠినంగా శిక్షించాలని ముస్లిం మత పెద్దలు పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో పేర్కొన్నారు.

Ramadan
Ramadan

మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తే చర్యలు తప్పవు, ముస్లింలకు పోలీస్ భరోసా.

 

కబ్రిస్తాన్ మీనార్ లా ధ్వంసం విషయంపై స్థానిక ముస్లిం గ్రామ పెద్దలు పోలీసులు ఆచరించడంతో, స్థానిక పోలీసులు అలాగే మహదేవపూర్ డిఎస్పి ముస్లింలకు భరోసా కల్పిస్తూ, మనోభావాలకు దెబ్బతీసే విధంగా దుశ్చర్యలకు పాల్పడితే ఎవరైనా సహించేది లేదని,ఖబ్రస్తాన్ మీనార్ల ను ధ్వంసం చేసిన వారిని సాధ్యమైనంత త్వరలో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముస్లిం మైనారిటీలు పోలీసులపై నమ్మకంతో ఉండాలని, మీ యొక్క మనోభావాలు కించపరచడం జరిగిన విషయం వాస్తవమే కానీ, ముస్లిం యువకులు గ్రామస్తులు సమన్వయం పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని, దుశ్చర్యలకు పాల్పడిన వారిని శిక్షించక తప్పదని మైనారిటీలకు పోలీస్ శాఖ భరోసా కల్పించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!