భవిష్యత్ లో పామాయిల్ పంటలదే పైచేయి

# జిల్లా ఉద్యానవన శాఖ అధికారి,మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రావు.
# విద్యుత్ ,వైద్య,విద్య శాఖలపై మండిపడ్డ ఎంపీటీసీలు.

సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రావు, ఎంపీపీ కోమల,


# జర్నలిస్టులకు,తెలంగాణ ఉద్యమకారులను ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఎంపిటిసిల తీర్మానం ప్రవేశం.
# సాఫీగా జరిగిన సర్వసభ్య సమావేశం.

దుగ్గొండి విద్యుత్తు ఏఈ ని నిలదీస్తున్న సొసైటీ చైర్మన్ మైపాల్ రెడ్డి.


నర్సంపేట,నేటిధాత్రి :
రాష్ట్రంలో రాబోయే భవిష్యత్ వ్యవసాయ పంటల పట్ల పామాయిల్ పంటలదే పైచేయి ఉంటుందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి,దుగ్గొండి మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు.బుదవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ అరుంధతి ఆధ్వర్యంలో చేపట్టగా ఎంపిపి కాట్ల కోమల భద్రయ్య అధ్యక్షతన జరిగింది.మండలం పరిధిలోని ఆయా శాఖ పనితీరు పట్ల శాఖల వారీగా వివరాలు సంబందీకు వివరించారు.సర్వసభ్య సమావేశం జరుగుతున్న క్రమంలో మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు,తెలంగాణ ఉద్యమకారులను ఇండ్ల స్థలాలు కేటాయించాలని పూర్తి స్థాయిలో ఎంపిటిసిలు తీర్మానం ప్రవేశ పెట్టారు.
మండలంలోని వైద్య సేవలు,
,ప్రభుత్వ పాఠశాలల్లో విద్య,బడిబాట కార్యక్రమం,విద్యుత్ అంతరాయం పట్ల ఆయా శాఖల అధికారులపై మండల సభ ప్రజా ప్రతినిధులు మండిపడ్డారు.ఐనప్పటికీ ప్రత్యేక అధికారి జోక్యంతో సర్వసభ్య సమావేశం సజావుగా జరిగింది.
దుగ్గొండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పల్లెల్లో వైద్యం అందడం లేదని దుగ్గొండి ఎంపిటిసి మోర్తాల రాజు ఆరోపించగా నిత్యం సమయపాలన పాటిస్తూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 వరకు అందుబాటులో ఉంటున్నామని ,పల్లె దవాఖలు ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలు చేయడానికి ప్రజల్లో ప్రోత్సాహం చేస్తున్న ఎవరు రావడం లేదని మందపెల్లి పల్లె దవాఖాన వైద్యురాలు వనమాల తెలిపారు.కేశవపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య అధికారులు అందుబాటులో ఉండటం లేదని లక్ష్మిపురం ఎంపిటిసి సుమన్ తెలుపగా కేశవపురం పిహెచ్ సి అధికారికి జిల్లా పీఓ పోస్ట్ వచ్చింది.అన్ని పీహెచ్ పి లు చూసుకోవాలి అందుకే రావడం లేదు. అని పిహెచ్ సీ సూపర్ వైజర్ తెలుపగా వెంటనే స్పందించిన మండల స్పెషల్ అధికారి శ్రీనివాస్ రావు వానాకాలం కావడంతో ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించడం కోసం సమయపాలన పాటించాలని పల్లె దవాఖానలలో వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.ఉద్యానవన పంటల వైపుకు రైతులు రావాలి.పామాయిల్ పంటల పట్ల రైతులు ఎలాంటి అపోహలు చెందద్దు.మొక్కలు నాటిన మొదటి సంవత్సరంలో మాత్రమే పెట్టుబడి,రిస్క్ ఎక్కువగా ఉంటాయి.తర్వాత తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చు.ఫామాయిల్ గెలల కోత సమయంలో మండల కేంద్రానికి ఒక కలెక్షన్ సెంటర్ ఉంటుంది.నర్సంపేట నియోజకవర్గం పరిధిలో ఫామాయిల్ పాక్టరీ నెక్కొండ మండలంలో రాబోతున్నది.ఇప్పటికే భూమి సేకరణ అయ్యింది. రాబోయే రోజుల్లో ఫామాయిల్ రైతులదే పైచేయి ఉంటుంది.ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పిస్తున్నాము.అని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు.రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అని అంటున్నారు.కరెంట్ 12 గంటల కూడా ఉండటం లేదు అని మహమ్మదాపురం ప్రాథమిక వ్యవసాయ సొసైటీ చైర్మన్ ఊరటి మైపాల్ రెడ్డి ప్రశ్నించగా సర్వసర సమీక్షంలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు ఆయనకు సపోర్టుగా విద్యుత్ శాఖ అధికారి దుగ్గొండి ఏఈ రామ్మూర్తిని నిలదీయగా 24 గంటల కరెంటు వస్తున్నది.అప్పుడప్పుడు కొన్ని సమస్యల వలన నిలుపుదల అవుతున్నది అని తడబడుతూ సమాధానం ఇచ్చారు.పలు శాఖల అధికారులు వారి పరిధిలో జరిగిన పనులు పట్ల వివరించారు.

# జర్నలిస్టులకు,తెలంగాణ ఉద్యమకారులను ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఎంపిటిసిల తీర్మానం ప్రవేశం…

దుగ్గొండి మండలంలో గత ఏండ్ల నుండి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు,అలాగే మలిదశ తెలంగాణ ఉద్యమం పాల్గొన్న ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించాలని కోరుతూ సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు ఏకగ్రీవంగా తీర్మానం ప్రవేశ పెట్టారు.ఈ నివేదికలను ప్రభుత్వానికి అందించాలని ఎంపీడీఓ,ఎంపిపి,మండల ప్రత్యేక అధికారికి తీర్మాన పత్రాన్ని అందజేశారు.ఈ సమావేశంలో ఎమ్మార్వో రవిచంద్ర రెడ్డి, ఎంపీఓ శ్రీధర్ గౌడ్,పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, ఎంఈఓ సత్యనారాయణ, ఏపిఎం రాజ్ కుమార్,పశువైద్యాధికారి రామ్మూర్తి, ఏపిఓ శ్రీనివాస్, ఆర్ డబ్ల్యుఎస్ ఏఈ మౌనిక,ఎంపీటీసీలు పిండి కుమారస్వామి,చింతల లావణ్య యుగేందర్,మోర్తాల రాజు,మామునూరి సుమన్,బండి జగన్, నాగనబోయిన మమత,రాంపిసు సోని,మాలోత్ చంద్రు, సొసైటీ చైర్మన్ లు సుకినే రాజేశ్వర్ రావు, ఊరటి మైపాల్ రెడ్డి బీ లతో పాటు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *