బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి నియోజకవర్గం
* బెల్లంపల్లికి చెందిన కుమారి కోట.సాయి మనోజ్ఞ సంప్రదాయ భరతనాట్య కళలో అబ్బురపరుస్తున్నారు చిన్న వయసు నుంచే నేర్చుకున్న విద్యలో విశేషంగ.ఆకట్టుకుంటున్నారు.2021 నుంచి.కుమారి సాయి మనోజ్ఞ బెల్లంపల్లి లో నాట్య గురువు పేరాల అర్చన జయప్రకాష్ వద్ద 2021 నుండి కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ప్రదర్శనలు చేసి అవార్డులు, సర్ఫికేట్స్ పొందారు.అవార్డులు ప్రశంసలు
ప్రపంచ కూచిపూడి దినోత్సవం సందర్భంగా చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రదర్శన ధ్రువీకరణ పత్రం, మెడల్, షీల్డ్ పొందారు. తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో నంది అవార్డు అందుకున్నారు. శ్రీ కళవేదిక వారు నిర్వహించిన గిన్నీస్ రికార్డు 24 గంటలు నాన్ స్టాప్ కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికేట్ పొందారు.చదువుతో పాటు నృత్య కళలో రాణిస్తుంది.ప్రస్తుతం కాసిపేట మోడల్ స్కూల్ లో విద్యను అభ్యసిస్తుంది.చదువులోనూ వారి క్లాసుల్లో ఉత్తమ స్థానంలో నిలుస్తూ ఆయా ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు.