ఆ హోటల్లో మాటల్లేవ్100కు పైగా వెరైటీలను వట్టి సైగలతోనే.

Management and Staff. Management and Staff.

ఆ హోటల్లో మాటల్లేవ్.. 100కు పైగా వెరైటీలను వట్టి సైగలతోనే..

 

 

 

 

ఈ హాటల్లోకి అడుగు పెట్టగానే సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు.

అన్ని హోటల్స్‌లాగే ఇక్కడ కూడా కస్టమర్ల ముందు మెనూ కార్డు పెడతారు.

అయితే ఆ కార్డు చూసిన తర్వాత నోటితో ఆర్డర్ చేయకుండా కోడ్స్ ద్వారా సైగలతో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.

ఈ హోటల్‌ గురించి తెలుసుకున్న వారంతా..

సదరు యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తున్నారు..

భోజన ప్రియులకు వింత అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో..

హోటళ్లలో చిత్రవిచిత్ర ఏర్పాట్లు చేయడం ప్రస్తుతం కామన్ అయిపోయింది.

జైలు, విమానాల తరహాలో ఉండే హోటళ్లను చూశాం, నీటి అడుగున ఏర్పాటు చేసిన హోటళ్లను కూడా చూశాం.

ఇలాంటి విచిత్రమైన హోటల్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

తాజాగా, ఇలాంటి విచిత్రమైన హోటల్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఆ హోటల్లో మాట్లాడుకోవడాలు ఉండవు. సుమారు 100కి పైగా వెరైటీస్‌ని కేవలం సైగల ద్వారానే సరఫరా చేసేస్తారు.

ఈ హోటల్‌‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ నగరంలోని అరేకా కాలనీలో ఎకోస్ (ప్రతిధ్వని) పేరుతో ఈ విచిత్రమైన రెస్టారెంట్‌‌ను ఏర్పాటు చేశారు.
ఈ రెస్టారెంట్‌లో (Restaurant) ఎలాంటి మాటలూ వినిపించవు.
హాటల్లోకి అడుగు పెట్టగానే సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తారు.
అన్ని హోటల్స్‌లాగే ఇక్కడ కూడా కస్టమర్ల ముందు మెనూ కార్డు పెడతారు.

అయితే ఆ కార్డు చూసిన తర్వాత నోటితో ఆర్డర్ చేయకుండా కోడ్స్ ద్వారా సైగలతో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.

ఒక్కో ఫుడ్‌కు ఒక్కో కోడ్ ఉంటుంది.

దాన్ని అనుసరించి సైగలు చేయడం లేదా పేపర్‌పై రాయాలి.

దీంతో సిబ్బంది వెంటనే ఆ కోడ్‌కు సంబంధించిన ఫుడ్‌ను తీసుకొస్తారు.

కస్టమర్లు కూర్చున్న టేబుల్ నంబర్, ఫుడ్ కోడ్ ఆధారంగా సిబ్బంది ఫాస్ట్‌గా ఆహారాన్ని సప్లై చేస్తారన్నమాట.

ఇంతకీ ఇలా సైగలతో ఫుడ్ ఆర్డర్ చేయడం వెనుక ఓ కారణం కూడా ఉంది.

దివ్యాంగులకు అండగా ఉండేందుకే..

మూగ, చెవిటి సమస్యలతో బాధపడుతున్న దివ్యాంగులకు అండగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ హోటల్లో పనిచేసేవారంతా మూగ, చెవిటి వారే.

అయినా వారు సైగలను, కోడ్స్‌ను వెంటనే క్యాచ్ చేసి..

ఫాస్ట్ ఫాస్ట్‌గా ఫుడ్ సప్లై చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇలా దివ్యాంగులకు హోటల్లో ఉపాధి కల్పించడమే కాకుండా వారికి మనోధైర్యం ఇస్తున్నారు.

ఇలా దివ్యాంగులతో హాటల్ నడుపుతుండంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ హోటల్ నిర్వాహకులను, సిబ్బందిని అంతా అభినందిస్తున్నారు.

ఈ హోటల్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దీనిపై నెటిజన్లు కూడా అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!