Students Turn Teachers in Siddapur
సిద్ధాపూర్లో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధిస్తారు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని
మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా, ఝరసంగం మండలం, సిద్ధాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు మరియు స్వీయ అభివృద్ధిపై అవగాహనను పెంచింది. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ వేడుకలో విద్యార్థులు తెలుగు, హిందీ, భక్తి గీతాలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు
