
Nizampet Police Crackdown
నిజాంపేటలో..
శునకాలతో .. తనిఖీలు
• చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే.. చర్యలు
• ఎస్ఐ రాజేష్.
నిజాంపేట: నేటి ధాత్ర
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎస్ఐ. రాజేష్ అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో గల కిరాణా షాప్, దాబాలు, పాన్ షాప్, బస్టాండ్ వివిధ బహిరంగ ప్రదేశాల్లో శునకాలతో స్థానిక ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డ్రగ్స్, గంజాయి లాంటి మదకద్రవ్యాలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ మాదక ద్రవ్యాలను విక్రయించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీల్లో నిజాంపేట పోలీసులు ఉన్నారు.