
`తెలంగాణలో కాంగ్రెస్ పాలనను పది కాలాలపాటు నిలుపుకుందాం.
`‘‘సిఎం రేవంత్ రెడ్డి’’ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్.
`తెలంగాణ వ్యాప్తంగా సన్నాలు పండిరచాం..
`ప్రతి గింజ కొనుగోలు చేసి రైతును రాజును చేశాం.
`రికార్డు స్థాయిలో వరి పండిరచి నెంబర్‌వన్ తెలంగాణ అని నిరూపించాం.
`రుణమాఫీ చేసి తెలంగాణ రైతులను రుణ విముక్తి చేశాం.
`రైతు భరోసాతో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం.
`సన్న బియ్యం పంపిణీ చేసి పేదల కడుపు నింపుతున్నాం.
`60 వేల ఉద్యోగాలిచ్చి రికార్డు నెలకొల్పాం.
`నిరుద్యోగుల కల నెరవేర్చుతున్నాం.
`తెలంగాణలో నిరుద్యోగాన్ని పారద్రోలుతున్నాం.
`జాబ్ క్యాలెండర్ తో యువత భవిష్యత్తు ఆశలు చిగురింపజేస్తున్నాం.
`ఒక్క సభతో పెరిగిన జోష్!
`సిఎం స్పీచ్‌తో నాయకులలో కనిపించిన ఉత్సాహం.
`సిఎం రేవంత్ మాట్లాడుతున్నంత సేపు ఈలలు, చప్పట్లు.
`పదేళ్లు నేనే సిఎం అనగానే నాయకులను నుంచి జేజేలు.
`ప్రతిపక్షాలకు సవాళ్లు విసురుతుంటే నాయకులు కరతాల ద్వానాలు.
`తనదైన శైలిలో మళ్లీ ప్రతిపక్షాలను ఓ ఆట ఆడుకున్న సిఎం.
`పంచాయతి ఎన్నికలలో అందరినీ గెలిపించే బాధ్యత నాది అని చెప్పారు.
`నాయకులు, కార్యకర్తలలో ఉత్సాహం నింపారు.
`ఇందిరమ్మ ఇండ్ల సంబరాలు చేయాలన్నారు.
`పదకొండేళ్ల తర్వాత పల్లెల్లో కాంగ్రెస్ బలం రెండిరతలైందన్నారు.
`ఈ బలం ఎల్లకాలం నిలుపుకుందాం అన్నారు.
`తెలంగాణలో కాంగ్రెస్ పాలన రెండు దశాబ్దాలు కాపాడుకుందాం.
`ఇందిరమ్మ రాజ్యం పేదల సంక్షేమానికి నెలవని చాటుదాం అని అన్నారు
హైదరాబాద్,నేటిధాత్రి:
నాయకుడు నింపే నమ్మకం ఏ పార్టీకైనా వెయ్యేనుగుల బలం ఇస్తుందని చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిదర్శనం. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరినప్పుడున్న పరిస్దితి, ఇప్పుడున్న పరిస్దితిని బేరీజు వేసుకుంటే పార్టీని నిజమైన నాయకుడు రేవంత్‌రెడ్డే అని చెప్పకతప్పదు. ఎందుకంటే ఏ నాయకుడైనా పార్టీని నమ్ముకొని రాజకీయాలు చేయాలనుకుంటాడు. పార్టీ పేరు చెప్పి రాజకీయాలు చేయాలనుకుంటాడు. పార్టీ పేరు చెప్పి ఎదగాలనుకుంటాడు. పార్టీ నీడలో పెరిగి పెద్ద నాయకుడౌతారు. కాని కొంత మంది నాయకులే పార్టీకే నీడకల్పిస్తారు. పార్టీకి జవసత్వాలు తెస్తారు. పార్టీని నిలబెడతారు. గెలిపిస్తారు. అధికారంలోకి తీసుకొస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిన వారిలో ఒకే ఒక్కడు సిఎం. రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత పెద్ద నాయకుడైనా సరే కాంగ్రెస్‌ను నమ్ముకొని రాజకీయాలు చేసిన వాళ్లే కనిపిస్తారు. కాంగ్రెస్ మూలంగానే నాయకులయ్యారు. కాంగ్రెస్ బలంతోనే నాయకులుగా చెలామణి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతోనే పదవులు అనుభవించారు. మొత్తం కాంగ్రెస్ చరిత్రలో రేవంత్‌రెడ్డి లాంటి నాయకుడు ఒక్కరు కూడా లేరు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా కాంగ్రెస్ నీడనే ఎదిగారు. కాంగ్రెస్‌లోనే బలమైన నాయకుడయ్యారు. పార్టీని నమ్ముకొని రాజకీయాలు చేశాడు. పార్టీ విశ్వాసం చూరొగని ముఖ్యమంత్రి అయ్యారు. కాని రేవంత్ రెడ్డి మాత్రమే పార్టీ కోసం వచ్చారు. పార్టీని నిలబెట్టారు. తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చారు. ఇలాంటి నాయకులు కాంగ్రెస్‌లో ఏ రాష్ట్రంలో లేరు. రేవంత్ రెడ్డిలాగా పార్టీని బతికించిన వారు లేరు. పార్టీ అదిష్టానంతో నాయకులైన వారే ఎక్కువ. రాజకీయాల్లో ఉన్నత పదవులు అందుకున్నవారే అందరూ. కాని కాంగ్రెస్ పార్టీలోనే స్పెషల్..కాంగ్రెస్ పార్టీకే స్పెషల్ నాయకుడు రేవంత్‌రెడ్డి. అందుకే పార్టీ అదిష్టానం కూడా రేవంత్ రెడ్డికి అంత ప్రాధాన్యత కల్పిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ గొప్పలు చెప్పుకునే వారే వుంటారు. పదవుల్లో పోటీ పడుతుంటారు. కాని గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేతిలో పట్టుకోకపోతే, ఆయన పిపిసి పదవిలో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ప్రతిపక్షం తప్పకపోయేది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించకపోయేవారు. ఇది నూరుపైసల నిజం. రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ వేదికగా నిలిచింది. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యేందుకు పార్టీ ఒక దారిని చూపింది. పదేళ్లుగా కుదేలైపోయిన పార్టీకి జీవం పోసిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి. ఆయన పార్టీలోకి చేరినప్పుడే పార్టీకి కొంత జోష్ వచ్చింది. ఆయన పిసిసి అద్యక్షుడు అయ్యాక పార్టీకి ఎప్పుడూ లేని ఊపు తెచ్చింది. ఈ రెండు రేవంత్ రెడ్డి వల్లనే వచ్చాయి. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా రేవంత్‌రెడ్డి పట్టించుకోలేదు. దాంతో ఆదిపత్య ధోరణి కోసం పాకులాడిన నాయకులకు కూడా రేవంత్ రెడ్డి ఆదర్శంగా నిలిచారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కారణమయ్యారు. ఇదిలా వుంటే ఇప్పుడు మళ్లీ పార్టీకి మరింత బలం పెంచేందుకు సిఎం. రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఈ మధ్య ఎల్బి స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ నాయకుల సమావేశ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రసంగం ఎంతో కాన్ఫిడెన్స్‌ను నింపింది. అంతే కాదు రేవంత్ రెడ్డి ధైర్యాన్ని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి పలుమార్లు చెప్పిన మాటే అయినా, మళ్లీ నాయకులు కొత్తగా విన్న భావనతో విన్నారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు సాధిస్తామని రేవంత్ రెడ్డి చెప్పడంతో నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఈలలు, చప్పట్లతో ప్రాంగణం మారుమ్రోగిపోయింది. రేవంత్‌రెడ్డి జయజయ ధ్వానాలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. వచ్చే పదేళ్లు మనదే అధికారం అని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో సీట్ల సంఖ్య పెరుగుతుందన్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యేందుకు చాన్స్ వుందన్నారు. పార్టీ కోసం కష్టపడితే మంత్రులు కూడ ఆయ్యే అవకాశాలున్నాయన్నారు. ఎక్కడిక్కడ నాయకులు తమ నాయకత్వ పటమితో పనులు చేయాలన్నారు. పార్టీని పట్టిష్టం చేయాలని కోరారు. నాయకులుగా ఎదగాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసేవారికి పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎందుకంటే ఈ పద్దెనమి నెలల్లో సాధించిన ప్రగతి ప్రజలకు వివరించాలన్నారు. వరి పంటలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని రికార్డును తెలంగాణ సాధించిందని గుర్తు చేశారు. తెలంగాణ రైతులకు ప్రజా ప్రభుత్వం ప్రోత్సాహమే కారణమన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రెండు కోట్లమెట్రిక్ టన్నులకు పైగా వరి ధాన్యం పండిరదని గుర్తు చేశారు. అందులోనూ సన్నాలు పండిరచడం వల్ల తెలంగాణ మొత్తానికి అన్నం పెట్టే అవకాశం కూడా దొరికిందని గుర్తు చేశారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేందుకే ప్రభుత్వాలు ముందూ వెనుక ఆలోచించేవన్నారు. కాని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్కతెలంగాణలోనే సన్న బియ్యం పేదలకు అందిస్తున్నామన్నారు. పేదల ఆకలిని సన్నబియ్యంతో తీర్చుతున్నామన్నారు. ఈ క్రెటిట్ తెలంగాణ వున్నంత వరకు రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్లో ఓ ఇద్దరి మాత్రమే చరిత్రలో చోటు కలిగింది. కాని ఇప్పుడు సన్న బియ్యంతో రేవంత్ రెడ్డి పేరు కూడా చిరిత్ర నిక్షిప్తం చేసుకున్నదని చెప్పాలి. రైతులకు భరోసా అందిస్తూ పెట్టుబడి సాయం చేస్తున్నారు. సన్నాలు పండిస్తే బోనస్‌లు ఇస్తున్నారు. పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నారు. గతంలో దళారులు బతికేవారు. కాని ప్రజా ప్రభుత్వంలో రైతులు బతుకుతున్నారు. రాజులౌతున్నారు. ఏక కాలంలో చేసిన రుణమాఫీ వల్ల రైతుకు భారం తీరింది. రుణవిముక్తి జరిగింది. మళ్లీ సకాలంలో రుణాలు అందేందుకు మార్గం పడిరది. ఇదంతా సిఎం. రేవంత్ నాయకత్వం వల్లనే సాధ్యమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలన్నింటికీ ఆదర్శమైంది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అదికారంలో వున్నప్పుడే దేశ వ్యాప్తంగా అప్పటి వరకు వున్న 90వేల కోట్ల రుణమాఫీ జరిగింది. దేశమంతా పండుగ చేసుకున్నది. దేశంలోని అప్పటి రైతులందరికీ రుణ విముక్తి జరిగింది. ఆ తర్వాత మళ్లీ బిజేపి కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచ్చినా ఏనాడు రుణమాఫీ జరగలేదు. బిజేపి పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ ముచ్చటే లేదు. కాని తెలంగాణలో ప్రజా ప్రభుత్వంలో, సిఎం. రేవంత్‌రెడ్డి పాలనలో రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ జరిగింది. ఇంతకన్నా ప్రజా ప్రబుత్వం మరెక్కడ వుంటుంది. ఆ క్రెడిట్ అంతా సిఎం. రేవంత్ రెడ్డికే దక్కింది. ఇక తెలంగాణలో మళ్లీ ఇందిరమ్మ ఇండ్ల పండుగ మొదలైంది. పదకొండేళ్లుగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నా సొంతింటి కల కూడా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తీరుతోంది. పదేళ్లులో పది ఇండ్లు కూడా కట్టకుండా ప్రజలను కేసిఆర్ మోసం చేశాడు. కాని పద్దెనమి నెలల కాలంలో సుమారు నాలుగు లక్షల ఇండ్లకు పట్టాలు పంచారు. ఇందిరమ్మ ఇండ్లకు మొదటి విడత లక్ష రూపాయలు అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఇండ్లు పూర్తి దశకు చేరుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మొదలౌతున్నాయి. శ్రావణ మాసంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. వచ్చే మూడేళ్లలో తెలంగాణలో 20 లక్షల ఇండ్లు నిర్మాణం చేయనున్నారు. ఇదీ ప్రజా పాలన అంటే. ప్రజా ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు 60వేల వరకు ప్రభుత్వ కొలువులిచ్చారు. గతంలోగాని, ఇప్పుడు గాని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కొలువులు ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు. ఏకకాలంలో 60వేల ఉద్యోగాలు కూడా ఒక రికార్డును సృష్టించింది. వీటన్నింటిపై ప్రతి పక్షాలకు సిఎం.రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. తనదైన శైలిలో బిఆర్ఎస్ను ఓ ఆట ఆడుకున్నారు. పంచాయితీ ఎన్నికల్లో త్వరలోనే నాయకులకు పదవులు వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే రెండుదశాబ్దాలు పాలన సాగిస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సంక్షేమం అందుతుందన్నారు. పేద ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అని సిఎం. మరోసారి పునరుగ్ఘాటించారు.