పేదోళ్లకు ఒక న్యాయం?… ఉన్నోళ్ళకు ఒక న్యాయం?..!
నిబంధనలకు విరుద్ధంగా భవన అక్రమ కట్టడాలు..
భవన నిర్మాణ హద్దులను తుంగలో తొక్కిన వైనం..
*అక్రమ భవన నిర్మాణ సెట్ బ్యాక్ పట్ల
మున్సిపల్ అధికారుల ఆంతర్యమేమిటి..?*
అక్రమ కట్టడం పట్ల నోటీసులు ఇచ్చిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు..
అధికారుల డిమాండ్ నోటీసులకు విలువ లేదా..?
అక్రమ కట్టడాలపై అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న పట్టణ పేద ప్రజలు.
బిల్డింగ్ నిర్మాణాలు ఆపాలని నోటీసులు ఇచ్చాం..
నోటీసులు ఇచ్చినం త్వరలో తీసుకుంటాం..
నర్సంపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సంధ్యారాణి.
నర్సంపేట నేటిధాత్రి:
*నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ధనికుల రాజ్యమే నడుస్తున్నది. వారు చెప్పిందే అధికారులు వినాలి. వారు చేస్తున్నది అధికారులు వేచి చూడాలి. పేదవాళ్లకు నష్టం జరిగిన మాకు సంబంధం లేదు. భవన నిర్మాణాలు ప్రభుత్వ నిబంధన వేరకు నిర్మించం. మాకు నచ్చిన విధంగానే కట్టడాలు చేపడతాం.మాకు పలుకుబడి,డబ్బు ఉన్నది. నిర్మాణం సమయంలో భవన సెట్ బ్యాక్ పట్ల మున్సిపల్ సిబ్బందికి సంబంధం ఉండదు.ఉన్న సంబంధిత అధికారులు పట్టించుకోరు.పేదోళ్లు ఒక్క ఇటుక పెడ్డ గోడ మొదలుపెట్టిన చాలు ఈగల్లా వాలిపోయి ఎలాంటి వాటినైనా కూల్చేస్తారు. ఇది నర్సంపేటలో జరుగుతున్న మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యపు వ్యవహారమని అందులో ఉన్న ఆంతర్యము ఏమిటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నర్సంపేటలో బడా బాబులకే భరోసా కల్పిస్తున్నారని..? పేదోళ్లకు ఒక న్యాయం… ఉన్నోళ్ళకు ఒక న్యాయం..! అని అన్నట్లుగా ఉందని పట్టణ ప్రజలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారం మొత్తం నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డుకు గల ఒక కార్పొరేట్ స్థాయి భవనం నిర్మాణం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతూ ఉండడం పట్ల వివిధ రకాల ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు నెక్కొండ రోడ్డు కు గల గ్రీన్ ల్యాండ్ పార్కు వెనుక భాగంలో కార్పొరేట్ స్థాయి భవనాన్ని మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు చేస్తున్నారని పట్టణ ప్రజలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నారు. ఆ భవనానికి 30 ఫీట్ల రోడ్డు ఉండగా రోడ్డు నుండి సెట్ బ్యాక్ తో మూడు మీటర్ల దూరం ఉండాల్సి ఉంటుంది. అలాగే భవనానికి మూడు వైపుల రెండు మీటర్లు సెట్ బ్యాక్ ఉండాల్సి ఉంది. కానీ వారి యొక్క పలకబడితో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కే సెట్ బ్యాక్ ఉండాల్సిన భూమిని కూడా భవన నిర్మాణంలోని కలిపి సెట్ బ్యాక్ లేకుండా కార్పొరేట్ స్థాయి భవనాన్ని నిర్మాణం చేపడుతున్నారని ఆరోపణలు ఎదురైతున్నాయి. ఇది సంబంధిత మున్సిపల్ అధికారులకు తెలిసినప్పటికీ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మిడిల్ క్లాస్ నుండి పేద ప్రజలు వాళ్లు ఆవాసం పొందేందుకు చిన్న చిన్న ఇండ్లు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే గద్దల్ల వాలిపోయే మున్సిపల్ సిబ్బంది ఇది లేదు అది లేదు. ఇది తక్కువ ఉంది అది తక్కువ ఉంది. ఇది నిబంధనలకు వ్యతిరేకంగా కడుతున్నారు అంటూ కూల్చేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బడాబాబులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తే మున్సిపల్ అధికారులు వారికే భరోసా ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.పట్టణ ప్రకృతివనం వెనుక నిర్మిస్తున్న కార్పొరేట్ స్థాయి భవనం నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని మున్సిపల్ అధికారులకు తెలిసినప్పటికీ తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని దీనిపట్ల సంబంధిత భవన నిర్మాణ
యాజమాన్యం,అధికారుల మధ్య ఉన్న ఆంతర్యం ఏమిటో అని పట్టణ ప్రజలు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.ఐనప్పటికీ నిర్మాణ పనులు మాత్రం చకచక నడుస్తున్నాయని ఆ అక్రమ నిర్మాణ పనులు మున్సిపాలిటీ అధికారులకు,సిబ్బంది కనబడుట లేదా అని పట్టణ ప్రజలు,ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారుల తీరుపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు.ఇప్పటిపైన సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న భవన నిర్మాణానికి చెక్ పెట్టాలని పట్టణ ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీ అధికారులు బడా బాబులకే ప్రాధాన్యత ఇస్తున్నారని అనే ఆరోపణలు కొట్టిపడేసేలా చర్యలు చేపట్టినా లేదా అన్ని వేచిచూడాల్సిందే..!
నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ పనులు..
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని నెక్కొండ రోడ్ గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనక భాగంలో భవనం నిర్మాణం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుపుతున్నారు.సమాచారం మేరకు
నిర్మాణ పనులను పరిశీలన చేసినం అని మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిని సంధ్యారాణి తెలిపారు.
షోకాజ్ నోటీసులు ఇచ్చనం..
నిబంధనలకు వ్యతిరేకంగా భవన నిర్మాణం పనులను ఆపాలని సంబంధిత యజమానికి షోకాజ్ నోటీసులు ఇచ్చాము.గడువు లోపు వివరణ ఇవ్వాలి లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని
మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిని సంధ్యారాణి వివరణ ఇచ్చారు.
కమిషనర్ ఆదేశాలతో చర్యలు తీసుకుంటాం.
నెక్కొండ రోడ్డుకు గల గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనుక భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు.అది నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని మా దృష్టికి వచ్చింది.మా సిబ్బంది వెళ్లి పరిశీలన చేశారు.వాస్తవమే అని తేలింది.సంబంధిత యజమానికి మున్సిపాలిటీ సిబ్బందితో నోటీసులు అందజేశాం.మున్సిపాలిటీ కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాము అని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారి వీరస్వామి గౌడ్ వివరణ ఇచ్చారు.