
> నారాయణపేట్ జిల్లా మరికల్ మండల కేంద్రానికి చేరుకున్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ కు మంగళ హారతులు ఇచ్చి.. నుదుట తిలకం దిద్ది.. స్వాగతించిన మరికల్ మహిళలు.
మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మరికల్ మండల కేంద్రానికి బిజెపి విజయ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ అధ్యక్షురాలు డీకే.అరుణ మండలానికి చేరుకున్నారు. మరికల్ మండల ప్రజలు బిజెపి నాయకులకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ,
తెలంగాణలో 17 స్థానాలు గెలుస్తామని అందులో మహబూబ్ నగర్ కూడా ఉంటుంది ఆమె అన్నారు.
అబకీ బార్ మోడి సర్కార్
ఔర్ ఎక్ బార్ మోడి సర్కార్ అని
మరోసారి మోడిని గెలిపించడమే విజయ సంకల్ప యాత్ర లక్ష్యమని
తెలంగాణ ప్రజలు కూడా మోడిని గెలిపించు కోవడానికి సిద్ధంగా ఉన్నారని,
ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టిన ఘనత మోడీదే అన్నారు.
పుల్వమా దాడిలో మన సైనికులను పొట్టనపెట్టుకున్న వారిని వారి దేశానికి వెళ్లి మట్టుబెట్టించిన ధైర్య శాలి ప్రధాని మోడి దే అని మరోసారి గుర్తు చేశారు.
విశ్వఖర్మ పేరుతో కులవృతులకు ప్రోత్సహం,
రైతుల సంక్షేమ కోసం అనేక సంస్కరణలు చేసిన వ్యక్తి ప్రధానమంత్రి మోడీ అని
దేశం మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి మోడీని గెలిపించుకోవాలి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరికల్ నుంచి నారాయణ పేట్ మీదుగా నేషనల్ హైవే నిర్మానానికి కృషి చేస్తాం అన్నారు.
వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ లు కూడా తీసుకొచ్చిన ఘనత బిజెపిదే
అయోధ్య లో భవ్య రామ మందిరం నిర్మించిన రాముల వారి దూత మోడి అని అన్నారు.