`రెండు రాష్ట్రాలకు మోగిన నగారా!
`జార్ఖండ్, మహారాష్ట్రలో జనం మొగ్గు ఎటు వైపు?
`పొత్తు పొద్దులు పొడిచేనా!
`హర్యానా ఓటమి తర్వాత కాంగ్రెస్ కళ్లు తెరిచేనా!
`గ్యారెంటీల ప్రకటనలుండేనా!
`మోదీని నమ్ముకొని బరిలోకి బిజేపి.
`ఆర్‌ఎస్‌ఎస్ కూడా తోడుగా నిలుస్తుంది.
`బిజేపికి ఆయువు పట్టే మహారాష్ట్ర.
`ఆర్‌ఎస్‌ఎస్ కీలక భూమిక మహారాష్ట్ర.
` రెండు సార్లు వరుసగా బిజేపి సంకీర్ణ పాలనే.
`మొదటి సారి సంకీర్ణ పూర్తిగా బిజేపి పెత్తనమే.
`రెండో సారి వెనకుండి నడిపించడమే.
`బిజేపి హాట్రిక్ కొట్టేనా!
`కాంగ్రెస్ వ్యూహమేమిటి?
`తెలంగాణ ఫార్ములా అమలు చేస్తారా?
`హర్యానాలో లాగా బోల్తా పడకుండా జాగ్రత్త పడతారా!
`మహారాష్ట్ర పార్లమెంటు ఫలితాలు రిపీట్ అవుతాయా!
`హిమాచల్, కర్నాటక లో ఐదు గ్యారెంటీలు
`తెలంగాణలో ఆరు గ్యారెంటీలు.
`హర్యానాలో ఏడు గ్యారెంటీలు.
`మహారాష్ట్ర, జార?ండ్ లలో గ్యారెంటీలుంటాయా?
హైదరాబాద్,నేటిధాత్రి:
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల నగారా మోగింది. కేంద్రంలో మూడోసారి అదికారంలోకి వచ్చి, ఇటవల హర్యానాలో హాట్రిక్ విజయం సాధించిన బిజేపి మంచి ఊపు మీద వున్నది. ఆ ఊపు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల మీద ప్రభావం వుంటుందా? వుండదా? అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. నిజానికి మహారాష్ట్రంలో బిజేపికి వ్యతిరేకత వున్న మాట వాస్తవమే కాని, పూర్తి స్ధాయిలో వ్యతిరేకత మాత్రం లేదు. వుంటే గత పార్లమెంటు ఎన్నికల్లో పూర్తి నైరాశ్యం మిగల్లేదు. అయితే ఇటీవల జరిగిన హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో బిజేపికి అనూహ్యమైన ఫలితాలు వచ్చి ఖాతాలో పడ్డాయి. హర్యానాలో బిజేపి ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. ఒక దశలో బిజేపి నుంచి పెద్దఎత్తున నాయకులు కాంగ్రెస్‌లో కూడా చేరారు. సరిగ్గా ఎన్నికల చివరి రోజున కూడా ఓ బిజేపి నాయకుడు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నాడు. అలాంటి ఎన్నికల్లో బిజేపి అనూహ్యంగా విజయం సాధించింది. కాంగ్రెస్‌ను ఓడిరచింది. దాంతో క్షేత్ర స్దాయిలో బిజేపికి మెరుగైన బలమే వుందన్న సంకేతాలు వెలువడినట్లైంది. ఇక జమ్ముకశ్మీర్ విషయంలో జమ్ములో బిజేపి అనూహ్యమైన సీట్లు సాదించింది. కశ్మీర్‌లో నేషనల్ కాన్పరెన్స్ గెలిచినా కాంగ్రెస్‌కు పెద్ద సీట్లు వచ్చిందేమీ లేదు. జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో బిజేపి గెలవకపోయినా, మెరుగైన సీట్లే సాదించింది. కాంగ్రెస్ గెలిచిన సీట్లు బిజేపి దరిదాపుల్లో కూడా లేవు. అంటే జమ్ముకశ్మీర్‌లో బిజేపి ఓడిపోయినట్లు కాదన్నది స్పష్టమైంది. ఇదే ఊపు మహరాష్ట్ర, జార్ఖండ్‌లలోనూ వుంటుందా? వుండదా? అన్నదే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా మహరాష్ట్ర ఎన్నికల్లో హర్యానా ప్రభావం వుంటుందని తెలుస్తోంది. హర్యానా ఎన్నికల ముందు ప్రీపోల్ సర్వేలన్నీ ఏకపక్షంగా తీర్పిచ్చాయి. అంతే కాదు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపాయి. కాని అనూహ్యంగా కాంగ్రెస్ చతికిలపడిరది. బిజేపి హాట్రిక్ కొట్టింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత వచ్చిన రాష్ట్రాల ఎన్నికల్లో బోణీ కొట్టింది. ఇప్పుడు మహరాష్ట్ర, జార్ఖండ్ వంతు వచ్చింది. ఇక్కడ కూడా బిజేపి జెండా ఎగరేస్తుందా? లేదా? అన్నది చూడాలి. అయితే ఈ ఎన్నికల వేళ లోతైన విశ్లేషణ రెండు పార్టీలు జరుపుకోవాల్సివుంది. హర్యానాలో కాంగ్రెస్ చేసిన పొరపాట్లు చేయకుండా చాలా జాగ్రత్తపడాల్సి వుంది. పైగా సమయం కూడా చాలా తక్కువగానే వుంది. కాకపోతే ఇప్పటికే క్షేత్ర స్దాయిలో ప్రచారాలు ఎప్పుడో ఊపందుకున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ అతి విశ్వాసానికి పోయింది. గెలుస్తామన్న ధీమాలో కాలయాపన చేసింది. పొత్తు ధర్మాలను పక్కన పెట్టింది. దాంతో పుట్టి మునిగింది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసమే కొంప ముంచింది. పొత్తుల సంసారం విచ్చుకునేలా చేసి మొదటికే మోసం తెచ్చుకున్నది. ఇప్పుటికైనా కాంగ్రెస్ తేరుకోవడం ఎంతో ముఖ్యం. ఒక వేళ హర్యానాలో అనుసరించినట్లే ఒంటెద్దు పోకడ అనుసరిస్తే మరోసారి చతికిలపడడం ఖాయంగానే కనిపిస్తోంది. పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పాటిస్తే రెండు రాష్ట్రాలలోనూ మెరుగైన ఫలితాలు సాదించే అవకాశం లేకపోలేదు. కాకపోతే హర్యానాలో ఇచ్చిన స్వేచ్చ ఈ రెండు రాష్ట్రాలలో ఇవ్వకూడదని అంటున్నారు. గతంలో కర్నాకట, తెలంగాణలోనే స్దానిక నాయకత్వాలకు పూర్తి స్వేచ్చనిచ్చారు. రెండు రాష్ట్రాలలో అనూహ్యమైన పలితాలు కాంగ్రెస్ పార్టీ అందుకున్నది. కాకపోతే అదే ఫార్ములాను అన్ని రాష్ట్రాలలో అనుసరించడం సరైంది కాదని హర్యానా ఓటమితో తేలిపోయింది. ఈ రెండు రాష్ట్రాలలో సీట్ల పంపకాలు చాలా జాగ్రత్తగా చేపట్టాలి. వరుసగా రెండు సార్లు బిజేపి కూటమి మహారాష్ట్రలో అదికారంలో వుంది. అక్కడ కొంత ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. అయినా అధికారం బిజేపి జారవిడుచుకోవాలనుకోదు. హర్యానాలో లాగా ఆఖరి బంతి వరకు పోరాటం చేయడంలో బిజేపిని మించిన రాజకీయం ఏ పార్టీకి లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా బిజేపి వ్యూహాలను గమనిస్తూ వుండాలి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వుండాలి. లేకుంటే కొంప కొల్లేరౌతుంది. బిజేపి గెలుస్తున్న రాష్ట్రాలలో బిజేపి పెద్దగా హమీలు ఇవ్వడం లేదు. మొత్తం మోడీ చుట్టూ రాజకీయం తిప్పుతున్నారు. ప్రధాని మోడీ చేత విసృతంగా ప్రచారం సాగిస్తున్నారు. బిజేపి నాయకులంతా శ్రద్దపెట్టి పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఆ అవకాశం లేదు. అనుకూలత కూడా లేదు. కేంద్రంతోపాటు, 13 రాష్ట్రాలలో బిజేపి అధికారంలో వుంది. ఈ రెండు అంశాలు బిజేపికి బాగా కలిసివస్తున్నాయి. బిజేపిని ఎలాగైనా ఓడిరచాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌పార్టీ హమీలను పెద్దఎత్తున ప్రజల ముందు పెడుతోంది. మొదట్లో వాటి ఫలితాలు అద్భుతంగానేవున్నాయి. కర్నాకట, హిమాచల్ ప్రదేశ్‌లోలో 5 గ్యారెంటీలతో హమీలు మొదలు పెట్టారు. ఆ రెండు రాష్ట్రాలు తమ ఖాతాలో వేసుకున్నారు. తర్వాత ఆరు నెలలకు జరిగిన తెలంగాణలో ఆరు గ్యారెంటీలు చెప్పారు. ప్రజలను నమ్మించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయ్యారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెండు రకాల వ్యూహాలు అమలు చేసింది. కర్నాకట, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లలో స్దానిక నాయకత్వాలు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. టిక్కెట్ల కేటాయింపుల్లో కూడా వారి మాటలకు విలువిచ్చింది. వారు సూచించిన వారికే సీట్లు ఇచ్చింది. పార్టీ గెలిచింది. అయితే హర్యాన దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్ వ్యూహం తలకిందులైంది. రెండు రాష్ట్రాలలో ఐదు గ్యారెంటీలు ప్రకటించి ప్రజలను ఆకట్టుకున్న కాంగ్రెస్, తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీలతో ఆకట్టుకున్నది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ గ్యారెంటీలను రాష్ట్ర స్ధాయి నాయకత్వం ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లింది. అధిష్టానంతో పదే పదే వాటి గురించి ప్రచారం చేయించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు విపరీతంగా ప్రచారం చేశారు. రాష్ట్ర నాయకులతోపాటు, అదిష్టానం కూడా పూర్తి స్ధాయిలో ప్రచారం నిర్వహించారు. దాంతో ఫలితాలు ఆశించినట్లు వచ్చాయి. కాని హర్యానాలో అలా జరగలేదు. హర్యానాలో ఏడు గ్యారెంటీల ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లలేదు. ప్రజలకు ఆ ప్రచారం చేరలేదు. స్ధానిక నాయకత్వానికి టిక్కెట్ల పంపకాన్ని వదిలేయడంతో, నాయకుల్లో విబేధాలు ఏర్పడ్డాయి. తెలంగాణ, కర్నాటకలో నాయకులంతా కలిసి కట్టుగా పనిచేశారు. హర్యానాలో నాయకులు ఏకతాటిపై నడవలేదు. ఇదే కాంగ్రెస్‌పార్టీని దెబ్బతీసింది. అందుకే మహరాష్ట్ర, జార్ఖండ్‌లలో ఉభయకుశలోపరిగా నిర్ణయాలు తీసుకుంటేనే మేలు జరగుతుంది. అయితే ఆ రెండు రాష్ట్రాలలో గ్యారెంటీలు వుంటాయా? అన్నది కూడా పెద్ద చర్చనీయాంశమైంది. కర్నాకట, తెలంగాణ, హిమాచల్, హర్యానాలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. గ్యారెంటీలు ప్రకటించింది. కాని మహరాష్ట్రలో కాంగ్రెస్‌పార్టీ ఒంటరిపోరు చేయదు. కాంగ్రెస్‌తో కలిసి సాగే శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేలు గ్యారెంటీల వైపు మొగ్గు చూపుతారా? లేదా? అన్నది కూడా సందేహించాల్సిన అంశమే. మూడు పార్టీల మధ్య పొత్తుతో మహారాష్ట్రలో గ్యారెంటీల అమలు సాద్యం కాకపోవచ్చు. పైగా పొత్తులో పోటీ చేసినా ఆయా పార్టీలకు కూడా ప్రత్యేకంగా మ్యానిఫెస్టోలు వుంటాయా? కాంగ్రెస్ జతకట్టే పార్టీలన్నీ కలిసి ఒకే మ్యానిఫెస్టో విడుదల చేస్తాయా? అన్నది తేలాల్సివుంది. ముందుగా పొత్తుల పంచాయితీ పూర్తయితే మ్యానిఫెస్టో ఆలోచనలు చేయొచ్చు. ఒక్కసారి పార్లమెంటు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఇండియా కూటమి 30 సీట్లు సాదించింది. ఎన్‌డీఏ కూటమి కేవలం 17 స్దానాలు మాత్రమే గెల్చుకున్నది. 2019 శాసన సభ ఎన్నికల్లో 105 గెల్చుకున్న బిజేపి ఈ పార్లమెంటు ఎన్నికల్లో 7 సీట్లు మాత్రమే గెలిచింది. అంటే బిజేపికి మహరాష్ట్ర ఇబ్బంది కరమైన పరిస్దితులు తలెత్తే అవకాశంలేకపోలేదు. 2019 ఎన్నికల్లో 54 స్ధానాలు గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో 13 సీట్లు గెల్చుకున్నది. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే పార్లమెంటు ఎన్నికల్లో బిజేపికి వ్యతిరేక పవనాలు వీచాయి. మరి రాష్ట్ర సమస్యల మీద ఎన్నికలు జరిగే శాసన సభ ఎన్నికల్లో బిజేపి ఎలాంటి అస్త్రాలను ప్రయోగిస్తుంది? గెలుపు బాట ఎలా పడుతుందనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.